ఆంధ్రప్రదేశ్‌

అగ్నిప్రమాదంలో వృద్ధురాలి సజీవదహనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిడదవోలు, నవంబర్ 2: విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా సంభవించిన అగ్నిప్రమాదంలో ఒక వృద్ధురాలు మంచంపైనే సజీవ దహనమయ్యింది. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలో గురువారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే స్థానిక శాంతినగర్‌లో ఒక భవనం రెండవ అంతస్తులో యర్రా బుల్లెమ్మ తన కుమారుడు యర్రా నాగ వెంట సాయికృష్ణ, అత్తయ్య యర్రా సర్వలక్ష్మి (75)తో నివసిస్తున్నారు. సాయికృష్ణ పట్టణంలోనే వ్యాపారం నిర్వహిస్తుంటాడు. వృద్ధాప్యం, ఇటీవలే కాలుకు దెబ్బ తగలడంవల్ల సర్వలక్ష్మి (75) గదిలో మంచానికే పరిమితమయ్యింది. గురువారం ఉదయం సాయికృష్ణ తన షాపునకు వెళ్లిపోయాడు. కోడలు బుల్లెమ్మ నీళ్లకోసం కిందకు వెళ్లింది. కొద్దిసేపటి తర్వాత పైకి వెళ్లేసరికి సర్వలక్ష్మి గది నుంచి పొగ వస్తుండటంతో కంగారుపడిన ఆమె కేకలు వేస్తూ భయంతో కిందకు దిగిపోయింది. చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకునేసరికి సర్వలక్ష్మి గదిలో మంటలు వ్యాపించి ఉండటంతో పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. పట్టణంలో అగ్నిమాపక శకటం అందుబాటులో లేకపోవడంతో కొవ్వూరు నుంచి అగ్నిమాపక సిబ్బంది నిడదవోలు చేరుకుని మంటలను అదుపుజేశారు. అయితే అప్పటికే సర్వలక్ష్మి మంచంపైనే సజీవదహనమై కనిపించింది. గది అంతా పొగచూరి, ఇతర సామాగ్రి సైతం కాలిపోయాయి. సంఘటనా స్థలానికి జిల్లా అగ్నిమాపక అధికారి ఎవి శంకరరావు, సిఐ ఎం బాలకృష్ణ, తహసీల్దార్ ఎం శ్రీనివాసరావు చేరుకుని పరిశీలించారు. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని భావిస్తున్నారు. మృతురాలి మనుమడు నాగ వెంకట సాయికృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిడదవోలు ఎస్సై జి సతీష్‌కుమార్ కేసు నమోదుజేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిడదవోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.