ఆంధ్రప్రదేశ్‌

తల్లిని చంపిన తనయుడికి జీవిత ఖైదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, నవంబర్ 2: వ్యసనాలకు బానిసై విచక్షణ కోల్పోయి డబ్బు కోసం కన్నతల్లిని హత్యచేసిన కొడుకుకు అనంతపురం జిల్లా సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధిస్తూ గురువారం సంచలన తీర్పు ఇచ్చింది. పోలీసులు, ప్రాసిక్యూషన్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం జిల్లా గార్లదినె్న మండలం కల్లూరు ఆర్‌ఎస్‌కు చెందిన సయ్యద్‌ఖాజా వలీకి భార్య, పిల్లలు ఉన్నారు. అనుమానంతో భార్య షేక్ మున్నా బేగంను 2011లో హత్య చేశాడు. శిక్ష అనుభవించి వచ్చిన అనంతరం తాగుడు, వ్యసనాలకు బానిసై డబ్బు కోసం తల్లి సయ్యద్ బీబీతో తరచూ గొడవపడేవాడు. ఈ క్రమంలో గత మార్చి 25వ తేదీ డబ్బు కోసం తల్లితో గొడవపడ్డాడు. ఆమె ఇవ్వకపోవడంతో కోపంతో రోకలిబండతో తలపై బాదాడు. తీవ్రంగా గాయపడిన సయ్యద్‌బీబీని అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 27వ తేదీ ఆమె మృతి చెందింది. మృతురాలి కుమార్తె సయ్యద్ హసీనా ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. నిందితుడు జైలులో ఉండగానే విచారణ వేగవంతంగా సాగింది. గురువారం తుది విచారణకు రాగా నేరం రుజువు కావడంతో జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి ఎస్.శశిధర్‌రెడ్డి నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.