ఆంధ్రప్రదేశ్‌

మావో ప్రభావిత ప్రాంతాల్లో రూ. 1380 కోట్లతో రహదారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరకులోయ, నవంబర్ 2: మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 1380 కోట్ల రూపాయలతో రహదారులు నిర్మించనున్నట్టు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. గురువారం ఆయన విశాఖ జిల్లా అరకులోయలో అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో నూతన రహదారులు నిర్మించి గిరిజన ప్రాంతాల అభివృద్ధికి బాట వేస్తామని చెప్పారు. గిరిజన ప్రాంతంలో నిర్మించే నూతన రహదారులతో పర్యాటక రంగం అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. హుదూద్ తుపానులో దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేసేందుకు భారీగా నిధులు మంజూరు చేశామన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. అభివృద్ధి పనుల నాణ్యతను తెలుసుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన అన్నారు. పథకాల అమలులో జాప్యం చేసే అధికారులను ప్రజాప్రతినిధులు నిలదీయాలని సూచించారు. ప్రతి నియోజకవర్గంలో బహిరంగ సభలు నిర్వహించి ప్రభుత్వ పథకాలను వివరించడంతో పాటు విస్తృత స్థాయిలో ప్రచారం చేసి ప్రజలను చైతన్యపరచనున్నట్టు అయ్యన్నపాత్రుడు చెప్పారు. అంతకుముందు పంచాయతీ రాజ్, రోడ్లు భవనాల శాఖల ఇంజనీరింగ్ అధికారులతో మంత్రి సమావేశమై అభివృద్ధి పనులను సమీక్షించారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు పాల్గొన్నారు.