ఆంధ్రప్రదేశ్‌

ఏసిబి వలలో గుడివాడ మున్సిపల్ కమిషనర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడివాడ, నవంబర్ 2: కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపల్ కమిషనర్ ఎన్ ప్రమోద్‌కుమార్ గురువారం అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. లక్షా 10 వేల రూపాయల నగదు లంచంగా తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా ఆయన దొరికిపోయారు. విజయవాడ అవినీతి నిరోధక శాఖ డిఎస్పీ ఎస్‌వివి ప్రసాదరావు తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపాలిటీలో సివిల్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న బోయ వెంకట అక్కారావు రూ.37 లక్షలకు సంబంధించిన పెండింగ్ బిల్లులకు పాస్ ఆర్డర్ ఇవ్వాలని కమిషనర్ ప్రమోద్‌కుమార్‌ను కోరారు. 3శాతం లంచంగా ఇస్తేనే బిల్లులకు పాస్ ఆర్డర్ ఇస్తానని, లేకుంటే కుదరదని కమిషనర్ ఆయనకు చెప్పారు. దీంతో అక్కారావు విజయవాడ ఎసిబి అధికారులకు ఫిర్యాదు చేశారరు. ఫిర్యాదును పరిశీలించిన అధికారులు ఎసిబి డిజిసి ఆర్పీ ఠాకూర్ దృష్టికి తీసుకెళ్లారు. ఠాకూర్ ఆదేశాల మేరకు కాంట్రాక్టర్ అక్కారావు డబ్బులిస్తుండగా కమిషనర్ ప్రమోద్‌కుమార్ అందుకుంటూ ఎసిబి అధికారులకు దొరికిపోయారు. రసాయన పరీక్షలు పాజిటివ్‌గా వచ్చాయని, లంచంగా తీసుకున్న రూ. 1.10 లక్షల నగదు రికవరీ చేశామని, డిసిటివో శ్రీ్ధర్, జూనియర్ అసిస్టెంట్ లక్ష్మయ్య సమక్షంలో పంచనామా జరిపినట్టు డిఎస్పీ ప్రసాదరావు వివరించారు.

చిత్రం..గుడివాడ మున్సిపల్ కమిషనర్ ఎన్ ప్రమోద్‌కుమార్