ఆంధ్రప్రదేశ్‌

మీ బండారం బయటపెట్టేందుకే సంకల్ప యాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 2: ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనుసరిస్తున్న అవినీతి కార్యకలాపాలను ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా తమపై ఉందని వైఎస్‌ఆర్‌సిపి ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు అన్నారు. గురువారం నాడిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేపడుతున్న పాదయాత్ర ద్వారా ప్రభుత్వ అవినీతిని ఎండగడతామని అన్నారు. ప్రభుత్వం అనసరిస్తున్న విధానాల వల్ల ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోందని అన్నారు. తమ నేత పాదయాత్ర పట్ల చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని, అడ్డుకోవాలని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ అవినీతి బండారం ఎక్కడ బయటపడుతుందోనని తెలుగుదేశం నేతలు హడలిపోతున్నారని అన్నారు. ప్రజా సంకల్ప యాత్రను నేరపూరిత కార్యకలాపంగా చూపించే అవసరం చంద్రబాబుకు ఎందుకు వచ్చిందని ధర్మాన నిలదీశారు. ప్రజాస్వామ్యంలో మితిమీరిన వ్యవహారాలను టిడిపి చేస్తోందని ఆయన విమర్శించారు. జగన్ పాదయాత్రకు అనుమతి అంశాన్ని చంద్రబాబు తెరమీదకు తెస్తున్నారని అన్నారు. గతంలో మీరు ఎవరి అనుమతి తీసుకుని పాదయాత్ర చేశారని నిలదీశారు. వైఎస్, షర్మిలమ్మ పాదయాత్రలో ఏమైనా దుర్మార్గాలు జరిగాయా అని ప్రశ్నించారు. ఇలాంటి అడ్డగోలు వాదనలతో ప్రతిపక్ష బాధ్యతను అడ్డుకోవడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌ను అప్పుల ఊబిలోకి నెట్టారని, నాలుగేళ్లలో లక్షా 18 వేల కోట్ల అప్పులు చేసి కోలుకోలేని రాష్ట్రంగా మిగిలిందని విమర్శించారు. 21 మంది తమ పార్టీ శాసనసభ్యులను టిడిపిలో చేర్చుకుంటే, వారిలో నలుగురిని మంత్రులుగా చేర్చుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మీ 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఇదేనా అని ధర్మాన నిలదీశారు.
సంకల్ప యాత్రతో బాబుకు కౌంట్‌డౌన్..
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టనున్న ప్రజా సంకల్ప పాదయాత్రతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందని వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే, పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఆర్కే రోజా అన్నారు. గురువారం నాడిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రోజా మాట్లాడుతూ జగన్ సంకల్ప యాత్ర చేపడితే చంద్రబాబుకు చెమటలు పడుతున్నాయని అన్నారు. చంద్రబాబు కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని రోజా పిలుపునిచ్చారు.