ఆంధ్రప్రదేశ్‌

ప్రతిపక్షం నోరునొక్కే కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, నవంబర్ 2: అసెంబ్లీలో మాట్లాడటానికి, ప్రజా సమస్యలను చర్చించడానికి విపక్షానికి అవకాశం ఇవ్వడంలేదని, అందుకే శాసనసభ కంటే ప్రజాసభే నయమని, ప్రజలతో మమేకం కావడానికి జగన్ పాదయాత్రకు సిద్ధమయ్యారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తెలిపారు. జగన్ పాదయాత్ర తేదీలు నిర్ణయించిన తర్వాతే అసెంబ్లీ తేదీలు ప్రకటించారన్నారు. గతంలో ‘వస్తున్నా మీ కోసం’ పేరిట చంద్రబాబు పాదయాత్ర చేసినపుడు కూడా అసెంబ్లీ జరిగినపడు ఆయన సభకు వెళ్ళారా? అని ప్రశ్నించారు. రాజమహేంద్రవరంలో గురువారం అంబటి విలేఖర్లతో మాట్లాడారు.
ప్రతిపక్షానికి ప్రాధాన్యత ఇవ్వని శాసన సభకు పవిత్రత ఎక్కడుందని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయించిన 21 మంది శాసనసభ్యులను సస్పెండ్ చేయాలని విపక్ష నేత లేఖ ఇస్తే, స్పీకర్ విముక్తి కల్పించలేదని విమర్శించారు. శాసనసభ కంటే ప్రజాసభే మేలని జగన్ పాదయాత్ర చేపడుతున్నారన్నారు. పాదయాత్ర నూటికి నూరుపాళ్లు సమంజసమని, శాసన సభలో దిక్కులేనపుడు ప్రజాసభే దిక్కవుతుందన్నారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, చంద్రబాబునాయుడు తరహాలోనే జగన్ పాదయాత్ర చేస్తారని, అపుడు వారు అనుమతులు తీసుకున్నారా అని అంబటి ప్రశ్నించారు. జగన్ పాదయాత్రవల్ల తుని వంటి ఘటనలు చోటుచేసుకుంటాయని అప్రమత్తంగా ఉండాలని సిఎం అంటున్నారంటే, అప్రమత్తంగా ఉంటే తుని ఘటన జరిగేది కాదని తెలుస్తోందన్నారు. దీన్నిబట్టి నాటి ఘటనలో ప్రభుత్వం విఫలమైందని స్పష్టమవుతోందన్నారు. వైసిపి యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజాపై దాడి చేసిన రామచంద్రవరం ఎస్సై నాగరాజును తక్షణం సస్పెండ్ చేయాలని, లేదంటే ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని అంబటి హెచ్చరించారు. జులుం ప్రదర్శించి, తప్పుచేసిన అధికారిపై తక్షణం చర్యలు తీసుకోకుంటే పోలీసులపై గౌరవం పోతుందన్నారు. దౌర్జన్యం చేసిన ఎస్సైని రక్షిస్తే రాష్ట్రంలో అరాచకం వస్తుందని, తక్షణం స్పందించకపోతే పరిణామాలు భిన్నంగా ఉంటాయని హెచ్చరించారు. ఎస్సై దాడిలో గాయపడి, ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న జక్కంపూడి రాజాను అంబటి రాంబాబు పరామర్శించారు. ఆయన వెంట వైసిపి జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, మాజీ ఎమ్మెల్యేలు రౌతు సూర్యప్రకాశరావు, పెండెం దొరబాబు తదితరులున్నారు.