ఆంధ్రప్రదేశ్‌

ఇళ్ల నిర్మాణాలకే ప్రాధాన్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 2: ప్రభుత్వం రాష్ట్రంలో గృహ నిర్మాణాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని సమాచార, పౌర సంబంధాలు, గ్రామీణ గృహ నిర్మాణ శాఖల మంత్రి కాలవ శ్రీనివాసులు చెప్పారు. వెలగపూడి సచివాలయం 5వ బ్లాక్ సమావేశ మందిరంలో గురువారం ఉదయం 13 జిల్లాలకు చెందిన ఆ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్లు, అధికారులతో ఆయన సమావేశమై ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం ప్రగతిని సమీక్షించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ 750 చదరపు అడుగుల ఇల్లు నిర్మించి జాయింట్ వాల్స్ నిర్మించుకునే అవకాశం కల్పించినట్లు చెప్పారు. బిల్డింగ్ ప్లాన్ నుంచి కూడా మినహాయింపు ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల వారికి ఇళ్లు నిర్మించే బృహత్తరమైన ఈ ప్రాజెక్టు రూ.19వేల కోట్ల విలువైనదని ఆయన తెలిపారు. గృహ నిర్మాణ పథకం అమలులో ప్రగతిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసించడం తనకు చాలా సంతోషంగా ఉందని, ఇదంతా సిబ్బంది శ్రమ ఫలితమేనని కొనియాడారు. 2018 జూన్ నాటికి 5లక్షల ఇళ్లు, 2019 జనవరి నాటికి 10లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయించవలసిన బాధ్యత మనపై ఉందన్నారు. ఎవరికి వారు తమ పనితీరుని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని సూచించారు. తానుకూడా మంత్రిగా నెలకోసారి సిఎంకు తన వ్యక్తిగత పనితీరుపై నివేదిక ఇస్తానని కాలవ చెప్పారు. పని విషయం, లక్ష్యాలు పూర్తిచేయడంలో అలసత్వం ప్రదర్శించే ఏఈలు, వర్క్ ఇన్‌స్పెక్టర్లపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తమకు ఎవరిపైనా శత్రుత్వం లేదని, పనిపై శ్రద్ధ చూపనివారి వల్ల ఈ పథకానికి నష్టం జరుగుతుందని, అందువల్ల అలాంటి వారిపై చర్యలు తీసుకొని, వారి స్థానంలో కొత్తవారిని నియమించాలని మంత్రి కాలవ సూచించారు. గృహ నిర్మాణ సంస్థ ఎండీ కాంతిలాల్ దండే మాట్లాడుతూ వర్క్ ఇన్‌స్పెక్టర్లు ఒక్కొక్కరు 250 ఇళ్ల నిర్మాణాన్ని పర్యవేక్షించవలసి ఉందన్నారు. అలాగే వారు జియో ట్యాగింగ్ చేయాలని, వారితో పాటు డీఈలు, వర్క్ ఇన్‌స్పెక్టర్ల పనితీరుని ఎప్పటికప్పుడు సమీక్షించాలని చెప్పారు. కృష్ణా, గుంటూరు, విజయనగరం, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పనితీరు ఇంకా మెరుగుపడవలసిన అవసరం ఉందన్నారు. సమావేశంలో గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ వర్ల రామయ్య కూడా పాల్గొన్నారు.

చిత్రం..గృహ నిర్మాణ పథకంపై సమీక్షిస్తున్న మంత్రి కాలవ శ్రీనివాసులు