ఆంధ్రప్రదేశ్‌

మహిళా బిల్లుకు ఏకగ్రీవ తీర్మానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: చట్టసభల్లో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ మంగళవారం నాడు ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది.
తీర్మానాన్ని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ప్రతిపాదించగా సభ ఏకగ్రీవంగా దానిని ఆమోదించింది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ గతంలోనూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఇదే తరహా తీర్మానాన్ని చేసిందని, అయితే చట్టసభల్లో మూడో వంతు రిజర్వేషన్ అమలులోకి రాలేదని, మరోమారు తీర్మానం చేయాల్సిందేనని అన్నారు. ఈ దేశంలో చరిత్ర తిరిగి రాయాల్సి ఉందని, చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రానికి సిఫార్సు చేయాల్సి ఉందని అన్నారు. చంద్రబాబు నాయుడు ప్రసంగం పూర్తికాగానే తీర్మానాన్ని శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించినట్టు స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ప్రకటించారు. ఈ అంశంపై తాను మాట్లాడదల్చుకుంటున్నట్టు విపక్ష నేత జగన్మోహన్‌రెడ్డి పేర్కొనగా, ఒక సారి చర్చ జరిగిన తర్వాత అదే అంశంపై మరో మారు ఎలా మాట్లాడతారని ఆయన ప్రశ్నించారు.
అనంతరం శాసనసభ్యులతో స్పీకర్ సమత్వ ప్రతిజ్ఞచేయించారు. ‘నేను మహిళలు, మరియు బాలికల ఆశయ సాధనకు సహకరిస్తాను, నేను తెలిసి గాని, తెలియక గాని మహిళల పట్ల చూసే వివక్షను ప్రతిఘటిస్తాను, నేను స్ర్తి పురుష సమానత్వ నాయకత్వాన్ని ఆహ్వానిస్తాను, నేను, స్ర్తిపురుష భావాలకు మరియు చర్యలకు సమానమైన విలువ ఇస్తాను, నేను మహిళలను కలుపుకొనే అనువైన సంస్కృతిని సృష్టిస్తాను...’ అని పేర్కొంటూ ఎమ్మెల్యేలతో ఈ ప్రతిజ్ఞ చేయించారు.