ఆంధ్రప్రదేశ్‌

10 నుంచి ఉద్యోగుల బదిలీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 1: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలను ఈనెల 10 నుంచి 20వ తేదీల మధ్య జరపాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన విధి విధానాలను త్వరలోనే విడుదల చేయాలని బుధవారం సిఎం క్యాంపుకార్యాలయంలో జరిగిన సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ప్రభుత్వ, ఎయిడెడ్, మున్సిపల్ స్కూళ్ళలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేయాలని నిర్ణయించినట్టు మంత్రి పల్లె రఘునాథ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 1,80,000 మంది విద్యార్థులకు సైకిళ్ళు పంపిణీ చేయనున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటీ 50 లక్షల మంది అసంఘటిత కార్మికులకు చంద్రన్న బీమా పథకాన్ని అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలో మొదటి విడత 10వేల ప్రభుత్వ పోస్ట్‌లను భర్తీ చేయాలని నిర్ణయించామన్నారు. ఇందులో 94 గ్రూప్-1 పోస్ట్‌లు, 750 గ్రూప్-2 పోస్ట్‌లు, 1000 గ్రూప్-3 పోస్ట్‌లు ఉన్నాయన్నారు. అలాగే ఆరు వేల పోలీస్ ఉద్యోగాలను పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేస్తామమని తెలిపారు. రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక వివరాలను సేకరించేందుకు జూన్ 20 నుంచి 30 వరకు, జులై ఐదు నుంచి 30 వరకూ రెండు దఫాలుగా స్మార్ట్ పల్స్ సర్వే నిర్వహించామని నిర్ణయించినట్టు తెలిపారు. తిరుపతిలోని ఇంటర్నేషనల్ డిజిటల్ టెక్నాలజీ సెంటర్‌లో అత్యాధునిక కోర్సులు ప్రవేశ పెడతామని, ఐఓటి అండ్ క్లౌడ్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ, బిగ్ డేటా అనాలసిస్ స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ, మోడరన్ కంప్యూటింగ్ స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ, డిజిటల్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ ఎక్స్‌లెన్సీని ఏర్పాటు చేయడానికీ కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.
భూ కేటాయింపులు
ఇక రాష్ట్రంలో వివిధ కంపెనీలకు భూములను కేటాయిస్తూ ప్రభు త్వం నిర్ణయం తీసుకుంది. అనంతపురం జిల్లా సోమంచిపల్లి మండలం గుడిపల్లిలో ఎస్‌ఎల్ డిఫెన్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 95 ఎకరాలను కేటాయించింది. 365 కోట్ల పెట్టుబడితో డిఫెన్స్ రంగానికి అవసరమైన పరికరాలను ఈ సంస్థ తయారు చేస్తుంది. ఇందులో 500 మందికి ప్రత్యక్షంగా, 4000 మందికి పరోక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి. విశాఖ జిల్లా కృష్ణపాలెం గ్రామంలో హిందుస్థాన్ కొకొకోలా బెవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 100 ఎకరాలను కేటాయించింది. 1375 కోట్ల పెట్టుబడితో నెలకొల్పనున్న ఈ కంపెనీలో 3645 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. చిత్తూరు జిల్లా వేలంపాడు గ్రామంలో సంధ్య సిరామిక్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 75 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. 140 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ఈ కంపెనీలో 500 మందికి ఉద్యోగాలు లభించనున్నట్టు రఘునాధరెడ్డి తెలియచేశారు. విశాఖ జిల్లా నక్కపల్లి మండలం గూనిపూడి గ్రామంలో ఆక్వాటెక్ క్వారంటైస్ ఫెసిలిటీస్ సంస్థకు 30 ఎకరాలను ఉచితంగా కేటాయిస్తూ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఎపి మెడ్‌టెక్ జోన్‌కు విశాఖలో 50 ఎకరాలను కేటాయించింది. ప్రస్తుతం మన దేశం విదేశాల నుంచి ఏటా సుమారు 24 వేల కోట్ల రూపాయల విలువైన వైద్య పరికరాలను దిగుమతి చేసుకుంటోంది. పై సంస్థను విశాఖలో ఏర్పాటు చేస్తే, ప్రస్తుతం మనం దిగుమతి చేసుకుంటున్న పరికరాలన్నీ ఇక్కడే తయారు చేయడానికి అవకాశం ఉంటుందని రఘునాధరెడ్డి తెలియచేశారు.
ఐదేళ్లే పదవీ కాలం
ఇదిలా ఉండగా 1948 డెంటల్ యాక్ట్ ప్రకారం డెంటల్ కౌన్సిల్ చైర్మన్ పదవిలో నియమితులైనవారు ఐదేళ్లపాటు మాత్రమే ఆ పదవిలో ఉండాలి. కానీ పదవీ కాలం పూర్తయినా, వారు ఆ పదవుల్లోనే కొనసాగుతున్నారు. ఇకపై ఐదేళ్ళ కాలపమితి పూర్తి చేసుకున్న వారు ఆ పదవిలో నుంచి తప్పుకోవాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఎపి టవర్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదించింది. ఈ అధికారాన్ని ఏపిఐఐకి అప్పగించింది. ప్రభుత్వ భవనాలపై సెల్ టవర్స్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. దీన్ని పిపిపి విధానంలో అమలు చేయాలని క్యాబినెట్ నిర్ణయిచింది. దీనివలన 3జి, 4జి సేవలు మరింత మెరుగ్గా వినియోగదారులకు అందుతాయని రఘునాధరెడ్డి చెప్పారు.
ఎపి పారా వెటర్నరీ అండ్ అలాయిడ్ కౌన్సిల్ ఏర్పాటుకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. దీనివలన పాలిటెక్నిక్‌లో డిప్లొమా కోర్సులో డెయిరీ, యానిమల్ హజ్‌బెండరీ, ఫిషరీస్ కోర్సుల్లో నాణ్యతా ప్రమాణాలు పెరుగుతాయని రఘునాధరెడ్డి తెలియచేశారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉజ్వల్ డిస్కమ్ అస్స్యూరెన్స్ యోజన (ఉదయ్) కార్యక్రమాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. డిస్కమ్ అప్పులలో 70 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని రఘునాధరెడ్డి చెప్పారు. దీనికి బదులు రాష్ట్ర ప్రభుత్వం బాండ్స్ ఇస్తుంది. దీని వలన నాలుగు శాతం వడ్డీ తగ్గుతుందని ఆయన తెలియచేశారు.
నవ నిర్మాణ దీక్ష కోసం జొన్న విత్తుల రచించిన గీతానికి, సంగీత దర్శకులు వందేమాతరం స్వరపరిచిన పాటలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ఈనెల ఎనిమిదిన ఒంగోలులో మహా సంకల్పదినాన్ని నిర్వహించడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

చిత్రం... మంత్రివర్గ సమావేశంలో మాట్లాడుతున్న చంద్రబాబు