ఆంధ్రప్రదేశ్‌

ఎసిబి వలలో టిపిఎస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం,జూన్ 2: విజయనగరం మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న సిహెచ్‌వి నారాయణరావు లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ గురువారం అవినీతి నిరోధకశాఖ అధికారులకు రెడ్‌హ్యండెడ్‌గా పట్టుబడ్డారు. పట్టణానికి చెందిన మురళి అనే బిల్డర్ జి- ప్లస్ 4 భవన నిర్మాణానికి సంబంధించి విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా) నుంచి అనుమతులు పొందారు. అయితే పట్టణ ప్రణాళిక విభాగం నుంచి భవన నిర్మాణానికి సంబంధించిన ఎండార్స్‌మెంట్ పత్రాలు తీసుకోవలసి ఉంది. ఈ పత్రాల కోసం టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ నారాయణరావును మురళి సంప్రదించగా, ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేస్తూ వస్తున్నారు. చివరకు లక్ష రూపాయలు ఇవ్వాలని బిల్డర్ మురళిని నారాయణరావుడిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో బిల్డర్ మురళి అవినీతి నిరోధికశాఖ అధికారులను ఆశ్రయించారు. ఎసిబి డిఎస్పీ సిహెచ్.లక్ష్మీపతి ఆధ్వర్యంలో సిఐలు ఎస్.లక్ష్మోజి, బి.రమేష్ గురువారం మధ్యాహ్నం మూడుగంటల సమయంలో తన ఇంట్లో మురళి నుంచి లంచం తీసుకుంటున్న నారాయణరావును రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు. నారాయణరావు ఇంటితోపాటు కార్యాలయంలో ఏసిబి అధికారులు తనిఖీలు జరిపారు.