ఆంధ్రప్రదేశ్‌

పోలీస్ బాస్ సవాంగ్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 12: రాష్ట్ర పోలీసు శాఖ సారథిగా విజయవాడ నగర పోలీసు కమిషనర్ గౌతం సవాంగ్‌కు అవకాశాలు మెరుగుపడుతున్నాయి. కొత్త డీజీపీ నియామక ప్రక్రియలో ప్రస్తుత డీజీపీ సాంబశివరావు కొనసాగింపు అంశానికి ఆటంకాలు ఎదురుకావడంతో కొత్త సారథిగా సవాంగ్ నియామకానికి మార్గం సుగమమైనట్లు కనిపిస్తోంది. డీజీపీ సాంబశివరావు పదవీకాలం మరో నెలలో ముగుస్తున్న నేపథ్యంలో కొత్త డీజీపీ ప్యానల్‌కు సీనియర్ల పేర్లు పంపిన రాష్ట్ర ప్రభుత్వం, అందులో సాంబశివరావు పేరు కూడా పొందుపరిచింది. అయితే ఆయన పేరును పరిగణనలోకి తీసుకోవడం సాధ్యంకాదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆ జాబితాను వెనక్కి పంపింది. తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా సాంబశివరావును వెంట తీసుకుని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిశారు. తమకున్న ప్రాధాన్యత దృష్ట్యా సాంబశివరావుకే డీజీపీ పీఠం ఇవ్వాలని కోరారు. దీనిపై రాజ్‌నాథ్ సింగ్ సానుకూలంగా స్పందించటంతో ప్రభుత్వ ప్రతిపాదనలు ఫలిస్తాయని భావించారు. తిరిగి రెండోసారి అదే జాబితా కేంద్రానికి పంపగా దాన్నికూడా తిరస్కరించి వెనక్కి పంపటంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయంపై దృష్టి సారించటం అనివార్యమయింది. అయితే ప్రభుత్వం సాంబశివరావు సర్వీసును మరో ఆరునెలలు పొడిగించే అవకాశాలున్నాయి. కాగా సాంబశివరావు పూర్తిస్థాయి డీజీపీ కాని నేపథ్యంలో విజయవాడ కమిషనర్ గౌతం సవాంగ్, ఏసీబీ చీఫ్ ఠాకూర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఆ మేరకు భారీ స్థాయిలో లాబీయింగ్ మొదలయినట్లు పోలీసు వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఠాకూర్ కోసం ఆయన మిత్రుడైన సీఎంవో ముఖ్య అధికారి ఒకరు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పోస్టింగులలో మంత్రుల మాట కూడా కాదని తనదైన ముద్ర వేస్తున్న సదరు అధికారి, డీజీపీ విషయంలోనూ తన మాట నెగ్గించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పటికే ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారని, అంతకంటే ముందు సీసీఎల్‌ఏ ఆశిస్తున్నారని, ఆయన లేకపోతే పరిపాలన కష్టమన్నట్లు ప్రచారం చేయించుకుంటున్నారనే వ్యాఖ్యలు ఐఏఎస్ వర్గాల్లో ఇప్పటికే వినిపిస్తున్నాయి. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబుకు నమ్మకస్తుడిగా పేరున్న గౌతం సవాంగ్‌కే ప్రస్తుత పరిస్థితిలో అవకాశాలు మెరుగైనట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. బాబు అనుకూల ముద్ర ఉన్న కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం లూప్‌లైన్ పోస్టింగులు ఇచ్చింది. అందులో సవాంగ్ కూడా ఒకరు కావడం ప్రస్తావనార్హం. ఠాకూర్ నిజాయతీపరుడు, ముక్కుసూటి అధికారే అయినప్పటికీ ప్రజాప్రతినిధులతో అంతగా సాన్నిహిత్యం లేకపోవడం, పెద్దగా ప్రజాసంబంధాలు లేకపోవడంతో ఇవి మెండుగా ఉన్న సవాంగ్‌కు ఆ అంశమే అనుకూలంగా మారుతుందని విశే్లషిస్తున్నారు. కీలకమైన ఎన్నికల సమయంలో అన్ని వర్గాలతో సఖ్యతగా ఉండటం, సాంబశివరావు మాదిరిగా వివాద రహితుడిగా ఉన్నవారికే డీజీపీ పీఠం ఇవ్వాలనుకుంటున్న ప్రభుత్వం, అందుకు సవాంగే తగిన అధికారి అని భావిస్తున్నట్లు సమాచారం.