ఆంధ్రప్రదేశ్‌

506.2 అడుగులకు సాగర్ నీటిమట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయపురిసౌత్, జూన్ 2: నాగార్జున సాగర్ జలాశయం నీటిమట్టం గురువారం సాయంత్రానికి 506.2 అడుగులకు చేరుకుంది. ఇది 125.8 టీఎంసీలకు సమానం. ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టుకు 400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నుండి నాగార్జున సాగర్ జలాశయానికి నీటి చేరిక పూర్తిగా నిలిచిపోయింది. సాగర్ జలాశయం నుండి ప్రధాన జల విద్యుత్ కేంద్రానికి నీటి చేరిక నిలిచిపోవడంతో సాగర్‌లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 775 అడుగుల వద్ద కొనసాగుతుంది. ఇది 18.54 టీఎంసీలకు సమానం. జూరాల, రోజాల నుండి శ్రీశైలం జలాశయానికి వచ్చే నీటి చేరిక పూర్తిగా నిలిచిపోయినట్లు సాగర్ ప్రాజెక్టు అధికారులు తెలిపారు.