ఆంధ్రప్రదేశ్‌

ఎడ్ సెట్ లో 96శాతం ఉత్తీర్ణత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 2: ఎస్వీ యూనివర్శిటీ గత నెల 23న రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 27 సెంటర్లలో నిర్వహించిన ఎపి ఎడ్‌సెట్- 2016 పరీక్షల్లో స్ర్తి,పురుష అభ్యర్థులు పోటాపోటీగా ఉత్తీర్ణత సాధించారు. పురుషులు 96.36శాతం ఉత్తీరణ సాధించగా మహిళలు 96.06శాతం ఉత్తీర్ణత సాధించారు. గురువారం ఎస్వీయూ విసి చాంబర్‌లో విసి ఆవుల దామోదరం పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. 11,705 మంది దరఖాస్తు చేసుకోగా 9,561 మంది పరీక్ష హాజరయ్యారు. వీరిలో 9,194మంది ఉత్తీర్ణత సాధించి 96.16 శాతం నమోదైంది. బయాలజీ సైన్స్‌లో పురుషులు 578మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 462 మంది పరీక్షకు హాజరవగా 451 మంది ఉత్తీర్ణులై 97.62శాతం నమోదయింది. అలాగే మహిళలు 1,788 మంది దరఖాస్తు చేసుకోగా 1,484మంది పరీక్షకు హాజరుకాగా 1,446మంది ఉత్తీర్ణులై 97.44 నమోదైంది. ఇక ఆంగ్ల పరీక్షలో 143మంది దరఖాస్తు చేసుకుని 117మంది హాజరై, 116 మంది ఉత్తీర్ణత సాధించి 99.15శాతం నమోదు చేశారు. మహిళలు 212 మంది దరఖాస్తు చేసుకుని 175 మంది హాజరుకాగా 171 మంది ఉత్తీర్ణులై 97.71 శాతం నమోదైంది. మాథ్‌మెటిక్స్‌లో పురుషులు 909మంది దరఖాస్తు చేసుకోగా 687మందిహాజరై, 663 ఉత్తీర్ణులై 96.15శాతం నమోదుచేశారు. మహిళలు 1,799 మంది దరఖాస్తు చేసుకుని 1439 మంది పరీక్షకు హాజరుకాగా అందరూ ఉత్తీర్ణులై నూరుశాతం నమోదు చేశారు. ఫిజికల్ సైన్స్ పరీక్షకు పురుషులు 401మంది దరఖాస్తు చేసుకుని 315మంది పరీక్షకు హాజరై 309 మంది ఉత్తీర్ణ సాధించి 98.10శాతం నమోదు చేశారు. మహిళలు 687 మంది దరఖాస్తు చేసుకుని 536మంది పరీక్షకు హాజరై అందరూ ఉత్తీర్ణులై నూరుశాతం నమోదుచేశారు. సోషల్ స్టడీస్‌లో 1868 మంది పురుషులు దరఖాస్తు చేసుకుని 1553 మంది పరీక్ష హాజరై 1481 మంది ఉత్తీర్ణత సాధించి 95.36శాతం ఉత్తీర్ణత సాధించారు. మహిళలు 3,320 మంది దరఖాస్తు చేసుకుని 2,793 మంది పరీక్షకుహాజరై 2,582మంది ఉత్తీర్ణ సాధించి 92.45 శాతం నమోదు చేశారు. మొత్తం మీద అన్ని పరీక్షలకు పురుషులు 3,899 మంది దరఖాస్తు చేసుకుని 3,134 మంది పరీక్షలురాసి 3,020 మంది అర్హత సాధించి 96.36 శాతం నిలిచారు. మహిళలు 7,806 మంది దరఖాస్తు 6,427 మంది పరీక్షలకు హాజరై 6,174 మంది ఉత్తీర్ణత సాధించి 96.06శాతం సాధించినట్లు కన్వీనర్ టి.కుమారస్వామి తెలిపారు.

చిత్రం ఏపి ఎడ్‌సెట్ ఫలితాలను విడుదల చేస్తున్న ఎస్వీయూ విసి దామోదరం