ఆంధ్రప్రదేశ్‌

‘సున్నా’ ఉష్ణోగ్రతలేనట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 19: రాష్ట్రంలో ప్రధాన పట్టణాలు, నగరాల్లో పగటి ఉష్ణోగ్రతలు ‘సున్నా’ డిగ్రీలకు చేరుకున్నాయి! వినడానికి వింతగా ఉన్నప్పటికీ, భారత వాతావరణ సంస్థ (ఐఎండీ)కు చెందిన అధికారిక వెబ్‌సైట్ ఇది నిజమేనంటోంది. ఐఎండీకి చెందిన హైదరాబాద్ మీట్రియోలాజికల్ సెంటర్ వెబ్‌సైట్లో రెండు తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రతలను తప్పులతడకగా నమోదు చేస్తున్నారు. ఐఎండీకి చెందిన ఐఎండీహైదరాబాద్.గవ్.ఇన్ వెబ్‌సైట్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వివిధ ప్రాంతాల్లో నమోదైన ఉష్ణోత్రలు, వర్షపాతం, తదితర అంశాలను అందుబాటులో ఉంచుతుంటారు. అయితే శుక్రవారం, శనివారం, ఆదివారం గరిష్ఠ ఉష్ణోగ్రతలు తప్పులతడకగా నమోదు అవుతున్నా, ఆ శాఖ అధికారులు స్పందించకపోవడం గమనార్హం. ఏపీకి సంబంధించిన వరకూ 20 ప్రాంతాల ఉష్ణోగ్రత వివరాలు ఆ సైట్‌లో ఉంటాయి. శనివారం గరిష్ఠ ఉష్ణోగ్రత కింద 5 పట్టణాల వివరాలు నమోదు చేశారు. మూడు ప్రాంతాల వివరాలు అందుబాటులో లేవంటూ, మిగిలిన ప్రాంతాల ఉష్ణోగ్రతను ‘సున్నా’గా నమోదు చేశారు. సాధారణ ఉష్ణోగ్రత కంటే గరిష్ఠ ఉష్ణోగ్రత ఎంతమేరకు ఎక్కువ, లేదా తక్కువగా నమోదైన కాలమ్‌లో 27.4 నుంచి 31.9 డిగ్రీలు తక్కువగా నమాదైనట్లుగా చూపించారు. పట్టికలో పొందుపరిచిన వాటిలో కూడా గరిష్ఠ ఉష్ణోగ్రతలను 0.2, 0.6గా నమోదు చేశారు. శుక్రవారం, ఆదివారం కూడా ఇలానే ఉష్ణోగ్రత వివరాలు నమోదు చేయడం గమనార్హం. దీనిపై ఇప్పటికైనా వాతావరణ శాఖ దృష్టి సారించాల్సి ఉంది.