ఆంధ్రప్రదేశ్‌

ఆరోగ్య వ్యాపారం ఎక్కువైంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 20: రాష్ట్రంలో ఆరోగ్య వ్యాపారం ఎక్కువైందని, గతంతో పోలిస్తే, వైద్య సేవలు మెరుగైనప్పటికీ, ఇంకా మెరుగుపరచాల్సి ఉందని పలువురు ఎమ్మెల్సీలు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర శాసన మండలిలో ఆరోగ్యంపై స్వల్పకాలిక చర్చ సోమవారం జరిగింది. ఈ సందర్భంగా సభ్యుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ 80 మంది ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారన్నారు. ఆరోగ్య వ్యాపారం ఎక్కువైందని, డెంగ్యూ రోగులను దోచుకుంటున్నారని ఆరోపించారు. ప్లేట్‌లెట్స్‌ను 20 వేల రూపాయల వరకూ విక్రయిస్తున్నారన్నారు. సభ్యుడు ఎంవివిఎస్ మూర్తి మాట్లాడుతూ మందులు కూడా కల్తీవి వస్తున్నాయని, వీటి వల్ల వైద్యం వికటిస్తుందని, కఠినంగా వ్యవహరించి నిరోధించాలన్నారు. సభ్యుడు డొక్కా మాణిక్య వరప్రసాదరావు మాట్లాడుతూ జనరల్ ఆసుపత్రుల్లో ఆశించిన స్థాయిలో రోగులకు సేవలు అందుతున్నాయా? లేదా ? అన్న అంశం పరిశీలించాలన్నారు. రైతుల ఆత్మహత్యలకు ఆరోగ్య సమస్యలు కూడా కొంత వరకూ కారణమన్నారు. ప్రజారోగ్యం క్షీణిస్తే, సమాజం క్షమించదన్నారు. మాతా, శిశు మరణాలను తగ్గించాలన్నారు. మరో సభ్యుడు అర్జునుడు మాట్లాడుతూ ప్రతి ఇంట్లో ఒక మందుల షాపు తయారైందని, చక్కెర వ్యాధికి కొంతమంది వైద్యులు అవగాహన లేకుండా మందులను రాస్తున్నారని తెలిపారు. సభ్యుడు పివి మాధవ్ మాట్లాడుతూ మెడికల్ ఆడిట్ అవసరమన్నారు. కొన్ని ఆసుపత్రుల్లో అనవసరంగా ప్రోసీజర్స్ చేస్తున్నారని, ఆడిట్ అవసరమన్నారు. ఎమ్మెల్సీ కత్తి నర్సింహారెడ్డి మాట్లాడుతూ వైద్యానికి నిధుల కేటాయింపు పెంచాలని, సిఎం సమీక్షలో 55 వేల వైద్య పరికరాలు నిరుపయోగంగా పడి ఉన్నాయని వెల్లడైందన్నారు. విద్యార్థులకు మాస్టర్ హెల్త్ చెకప్ అవసరమన్నారు.