ఆంధ్రప్రదేశ్‌

‘కేంద్రం హోదా ఇస్తామంటే మాకేమీ అభ్యంతరం లేదు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 20: ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రప్రభుత్వం చెప్పిన మీదటనే అందుకు సమానమైన ప్యాకేజీకి సీఎం చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నారని, హోదా ఇస్తామంటే తమకేమీ అభ్యంతరం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మంత్రి సోమిరెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక హోదా అనేది అసెంబ్లీకి సంబంధించిన విషయం కాదని, కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సిన అంశంపై ప్రతిపక్షాలు ఇక్కడ ఆందోళన చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రత్యేక హోదాపై మాట్లాడుతున్న ప్రతిపక్ష నేత జగన్ తన ఎంపీల చేత రాజీనామా చేయిస్తానని బీరాలు పలికారని, ఆ మాటలు ఏమయ్యాయంటూ ప్రశ్నించారు. పాదయాత్రలో జగన్ ఇస్తున్న హామీల అమలు అసాధ్యమని, ఈ హామీల అమలుకు లక్షల కోట్లు కూడా సరిపోవన్నారు. 12 కేసుల్లో ముద్దాయిగా ఉన్న జగన్ మాటలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవాచేశారు. అసెంబ్లీలో ప్రశ్నించకుండా ప్రతిపక్షం రోడ్డుమీద ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. సముద్రంలో కలిసే 100 టిఎంసిల నీటిని పట్టిసీమ ద్వారా కృష్ణానదికి మళ్లించి డెల్టాలోని రైతాంగాన్ని టిడిపి ప్రభుత్వం ఆదుకుందన్నారు. మిగులు జలాలను వాడుకోవాల్సిన రాయలసీమ ప్రజలు పట్టిసీమ ద్వారా లబ్ధిపొందుతున్నారని, అటువంటి ప్రాజెక్టుపైనా ప్రతిపక్షం చేస్తున్న విమర్శలు అర్థరహితమన్నారు.