ఆంధ్రప్రదేశ్‌

స్పీకర్ తీరు అభ్యంతరకరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 22: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ టీడీపీ కార్యకర్తలా అసెంబ్లీని నిర్వహిస్తున్నారని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. విశాఖలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ నాయకుడు అంబటి రాంబాబుపై హక్కుల తీర్మానం చేయడం అర్ధరహితమని మండిపడ్డారు. వైసీపీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ తాము ఫిర్యాదు చేస్తే కనీసం పట్టిచుకోకుండా, టీడీపీ అధినేత ఆదేశాల మేరకు వ్యవహరిస్తున్నారన్నారు. ఫిరాయింపుల చట్టం ఉల్లంఘనకు పాల్పడిన వైసీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులిస్తే, వారితోనే సభ నిర్వహిస్తూ శాసనసభ గౌరవాన్ని స్పీకర్ మంటగలిపారని విమర్శించారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో స్వల్ప మెజారిటీతో గెలుపొందిన కోడెల, అక్కడి ప్రజల మనోభావాల మేరకు పనిచేయట్లేదని మండిపడ్డారు. ఆ ప్రాంత ప్రజల మనోభావాల మేరకు వైసీపీ నేత అంబటి రాంబాబు మాట్లాడారన్నారు. నియోజకవర్గంలో కోడెల కుటుంబీకుల అరాచక పాలన సాగుతోందుని, వాటిని కప్పిపుచ్చుకునేందుకే టీడీపీ అంబటిపై కఠిన చర్యలకు తీర్మానం చేసిందన్నారు. ప్రజల పక్షాన నిలబడాల్సిన స్పీకర్ పార్టీ తరపున పనిచేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో గెలుపొందేందుకు తాను రూ.12 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చిందని స్పీకర్ కోడెల స్వయంగా మీడియా ఎదుట ఒప్పుకున్నారని గుర్తు చేశారు. మూడున్నరేళ్లుగా స్పీకర్‌గా కోడెల సభా గౌరవాన్ని మంటగలిపారన్నారు. రాష్ట్రాన్ని టీడీపీ నేతలు దోచుకుతింటున్నారని బొత్స ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి రాగానే పంచభూతాలను దోచుకోవడం ప్రారంభించిందన్నారు. ఎయిర్ పోర్టు అథారిటీని కాదని ప్రైవేటు సంస్థలకు పనులు అప్పగించడం వెనుక అవినీతి జరుగుతోందని ఆరోపించారు. విశాఖలో భూ కుంభకోణంపై సిట్ దర్యాప్తు అంతంతమాత్రంగానే జరిగిందన్నారు. అసలు నిందితులను విడిచిపెట్టి, చిరుద్యోగులను బలిచేశారన్నారు. సాక్షాత్తు ఒక మంత్రి అవినీతికి పాల్పడినట్టు మరో సీనియర్ మంత్రి ఫిర్యాదు చేస్తే కనీసం చర్యలు తీసుకునేందుకు యత్నించలేదన్నారు. మిత్రపక్షంగా ఉన్న బీజేపీ సభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు.

.