ఆంధ్రప్రదేశ్‌

‘చలో అసెంబ్లీ’ భగ్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), నవంబర్ 22: నకిలీ విత్తనాలతో నష్టపోయామంటూ కృష్ణాజిల్లా రైతులు చేపట్టిన ‘్ఛలో అసెంబ్లీ’ని పోలీసులు అడ్డుకున్నారు. విజయవాడకు తరలివచ్చిన రైతులు వెలగపూడి అసెంబ్లీకి బయలుదేరే సమయంలో వారిని నగర పోలీసులు రైల్వేస్టేషన్‌లోనే అడ్డుకున్నారు. పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్‌కు తరలించారు. దీంతో అరెస్టులను నిరసిస్తూ.. మరోవైపు నకిలీ విత్తనాలతో పంట నష్టపోయిన తమను ఆదుకోని ప్రభుత్వానికి ఆందోళన తెలిపే భాగంలో ముగ్గురు రైతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామానికి చెందిన రైతులు నకిలీ మిర్చి విత్తనాల కారణంగా పంట నష్టపోయామని, పలుమార్లు అధికారులకు గోడు వెలిబుచ్చారు.
దీనిపై స్పందించిన కలెక్టర్ గతంలో వీరికి నష్టపరిహారం చెల్లించాల్సిందిగా ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే ఇప్పటివరకు వారికి అందకపోగా.. పంటనష్టం వల్ల తాము సర్వనాశనమయ్యామని, తమ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళేందుకు సిద్ధమైన రైతులు బుధవారం ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా విజయవాడ చేరుకోగా.. రైల్వేపోలీస్టేషన్ వద్ద అడ్డుకున్న పోలీసులు రైతులను అరెస్టు చేసి పోలీసు వాహనాల్లో నగర శివారులోని నున్న రూరల్ పోలీస్టేషన్‌కు తరలించారు. మొత్తం 30మంది రైతులను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ మరికొందరు రైతులు తమ గ్రామాల నుంచి స్టేషన్ వద్దకు చేరుకున్నారు. బేషరతుగా తమ వారిని విడుదల చేయాలని స్టేషన్ ముందు నిరసనకు దిగారు. పోలీసులు మొత్తం 27 మందిని అరెస్ట్ చేసి నున్న గ్రామీణ పోలీసు స్టేషన్‌కు తరలించారు. బేషరతుగా రైతులను విడుదల చేయాలని స్టేషన్ ముందు నిరసనకు దిగారు. నున్న సీఐ సహేరా బేగం వీరికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పోలీసులు నచ్చచెప్పే ప్రయత్నం చేసినా సహనం కోల్పోయిన రైతులు ఆత్మహత్యాయత్నం చేశారు. రైతుల ఆత్మహత్యాయత్నంతో పరిస్ధితి ఒక్కసారిగా మారిపోయింది. ఈ హఠాత్పరిణామంపై వెంటనే తేరుకున్న సీఐ సహేరా బేగం, ఎస్‌ఐలు బీవీ శివప్రసాద్, కట్టా నాగేశ్వరరావు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ముగ్గురిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.