ఆంధ్రప్రదేశ్‌

సిట్ కాలపరిమితి పొడిగింపుపై ప్రజల్లో అనుమానాలు మండలిలో ఎంవీవీఎస్ మూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 22: విశాఖలో భూ రికార్డుల తారుమారుకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ పొడిగింపుపై ప్రజల్లో అనుమానం వ్యక్తం అవుతోందని ఎమ్మెల్సీ ఎంవివిఎస్ మూర్తి తెలిపారు. ఇప్పటికే మూడు సార్లు పొడిగించారని, మరోసారి పొడిగిస్తారనే అమనుమానాలు వస్తున్నాయన్నారు. మరింత జాప్యం జరిగితే జ్యుడీషియల్ ఎంక్వైరీ అవసరం రావచ్చన్నారు.

2873 ఫిర్యాదులు వచ్చాయి : కేఈ

విశాఖ భూ రికార్డుల తారుమారుపై అడిగిన ప్రశ్నకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) కెఇ కృష్ణమూర్తి మాట్లాడుతూ సిట్‌కు ఇప్పటి వరకూ 2873 ఫిర్యాదులు వచ్చాయన్నారు. వీటిని వివిధ కేటగిరీల కింద విభజించామన్నారు. ఈ ఫిర్యాదులు పరిశీలించడానికి 6 బృందాలను ఏర్పాటు చేశామన్నారు. కల్తీ విత్తనాలను నిరోధించేందుకు చర్యలు చేపడుతున్మాని, కానీ ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. సభ్యుడు చిక్కాల రామచంద్రరావు అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిస్తూ, నాలుగు నెలల్లో ఇన్‌పుట్ సబ్సిడీని 1900 కోట్ల రూపాయల మేర చెల్లించామన్నారు.