ఆంధ్రప్రదేశ్‌

సమీక్షల పేరుతో ఉద్యోగులను వేధించొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, నవంబర్ 23: జిల్లా, రాష్టస్థ్రాయిలో సమీక్షలు, వీడియోకాన్ఫరెన్స్‌లు, టెలీకాన్ఫరెన్స్‌లు, సెట్‌కాన్ఫరెన్స్‌లు బాగా పెరిగిపోయాయని వాటి పేరుతో అధికారులను, ఉద్యోగులను వేధించవద్దని ఏపీఆర్‌ఎస్‌ఏ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరారు. గురువారం కలెక్టరేట్‌లోని ఏపీఆర్‌ఏస్‌ఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రోజుకో రివ్యూ, రోజుకో కాన్ఫరెన్స్ నిర్వహిస్తుండడంతో కిందిస్థాయి అధికారుల నుంచి పైస్థాయి అధికారుల వరకు తీవ్రమైన ఒత్తిడి పెరిగిందన్నారు. కాన్ఫరెన్స్, రివ్యూల వల్ల అధికారులు తిరగడానికే సరిపోతుందు కాని కూర్చుని పనిచేసుకునే వీలు కలగడం లేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న 1100 పరిష్కార వేదికలో అనుభవం లేనివారు పనిచేయడం వల్ల ప్రజల నుంచి వచ్చే అర్జీలన్ని రెవెన్యూ శాఖకు పంపుతున్నారని ఆరోపించారు. విషయ పరిజ్ఞానం, అనుభవం ఉన్నవారిని నియమిస్తే అలా జరగదన్నారు. దానికితోడు 1100కు వేల సంఖ్యలో ఫిర్యాదులు వచ్చి పడుతున్నాయన్నారు.
11వ పీఆర్‌సిని నియమించాలి
రాష్ట్ర ప్రభుత్వం 11వ పీఆర్‌సి కమిషన్‌ను వెంటనే నియమించాలని బొప్పరాజు డిమాండ్ చేశారు. 2018 జూన్ 31 నాటికి 10వ పీఆర్‌సి ముగుస్తుందని ఆ తరువాత రోజు నుంచి 11వ పీఆర్‌సి అమలులోకి రావాల్సి ఉంటుందన్నారు. ఇందుకోసం 11వ పీఆర్‌సి కమిషన్‌ను వెంటనే నియమించాలన్నారు. 10వ పీఆర్‌సికి సంబంధించి 4 లక్షల మంది విశ్రాంత ఉద్యోగులకు బకాయిలను చెల్లించాల్సి ఉందన్నారు. ఉద్యోగులకు విడతల వారీగా చెల్లించాలన్నారు. ఈ సమావేశంలో ఏపీఆర్‌ఎస్‌ఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు చొప్పా రవీంద్రబాబు, జిల్లా అధ్యక్షుడు నరసింహులు, నాయకులు జనార్థన్‌రావు, మురళి పాల్గొన్నారు.