ఆంధ్రప్రదేశ్‌

విభజన పాపం మీదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 24: రాష్ట్ర విభజనలో మీరే కీలక భూమిక పోషించారని వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. రెండు కళ్ల సిద్ధాంతంతో టీడీపీ అధినేత చంద్రబాబు, కాంగ్రెస్‌తో కుమ్మక్కై ఆడిన నాటకం కారణంగానే రాష్ట్రం విడిపోయిందని విశాఖలో శుక్రవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆరోపించారు. రెండు కళ్ల సిద్ధాంతం పేరిట రాష్ట్ర విభజనలో కీకల భూమిక పోషించిన చంద్రబాబు ఇప్పుడు నెపాన్ని ఇతర పార్టీల మీదకు నెట్టడం ఆయన నైజాన్ని చాటుతోందన్నారు. ఎన్నికల ముందు రాష్ట్ర విభజన అంశాన్ని చక్కగా వాడుకుని అధికారంలోకి వచ్చారని, ఇప్పుడు మళ్లీ అదే అంశాన్ని రాజకీయ లబ్ధికోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలో ఉండగా, రాష్ట్ర విభజన అంశంపై అఖిలపక్ష సమావేశంలో అప్పటి టీడీపీ శాసనసభ పక్ష ఉపనేత అశోక్ గజపతి రాజు, మోత్కుపల్లి నర్శింహులు, గాలి ముద్దుకృష్ణమ నాయుడు తదితరులచే అసెంబ్లీలో తీర్మానానికి అనుకూలంగా వ్యవహరించాలని పేర్కొనలేదాని ప్రశ్నించారు. విభజన అంశానికి సంబంధించి పార్టీ సీనియర్ నేత ఎర్రన్నాయుడు ద్వారా కేంద్రానికి లేఖ పంపిన సంగతి గుర్తు తెచ్చుకోవాలన్నారు. ఈ అంశాలు చోటుచేసుకున్నప్పటికి వైసీపీ పార్టీ పుట్టలేదన్న వాస్తవం గుర్తించాలన్నారు. విభజన ఉద్యమం జోరుగా జరుగుతున్న తరుణంలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఆఖరి బంతి నాచేతిలోనే అంటూ మభ్యపెట్టడం వెనుక మీ రాజకీయ చతురత ఉందని ఆరోపించారు. కిరణ్‌కుమార్ రెడ్డితో రాజకీయ పార్టీ పెట్టించి, ఓట్లను చీల్చి అధికారంలోకి వచ్చేందుకు వాడుకున్నారని మండిపడ్డారు. విభజన సందర్భంగా రాష్ట్రానికి అవసరమైన అంశాలను చట్టంలో పెట్టించినా, మీరు అధికారంలోకి వచ్చిన తరువాతే వాటిని తుంగలోకి తొక్కించారన్నారు. ప్రత్యేక హోదా, వెనుకబడిన ప్రాంతాలకు ప్యాకేజీ వంటి అంశాలు బీజేపీ వద్ద తాకట్టుపెట్టి రాజకీయ స్వలాభం చూసుకున్నారని ఆరోపించారు. కిరణ్‌కుమార్ సోదరుడు మీ పార్టీలో చేరితే, విభజన పాపాన్ని వైకాపాపైకి నెట్టేందుకు వెనుకాడని మీ రాజకీయం జనం గమనిస్తున్నారన్నారు. చంద్రబాబు మాదిరి టక్కుటమార రాజకీయాలు ప్రపంచంలోనే ఎవరూ చేయరన్నారు. వైకాపాను వీడి వెళ్తున్న ఎమ్మెల్యేలు రాష్ట్భ్రావృద్ధి కోసమే టీడీపీలో చేరుకుతున్నట్టు చెప్పడాన్ని ఆయన ఖండించారు. ఇప్పటి వరకూ పార్టీ మారిన ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధి ఏమిటని ప్రశ్నించారు.