ఆంధ్రప్రదేశ్‌

ఇళ్ల నిర్మాణంలో నాణ్యతకు పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, నవంబర్ 24: రాష్ట్రంలో చేపట్టిన పేదల గృహనిర్మాణంలో ఆధునిక టెక్నాలజీని అవలంభిస్తూ నాణ్యతా ప్రమాణాలకు పెద్దపీట వేస్తున్నామని పురపాలకశాఖ మంత్రి నారాయణ అన్నారు. ఇళ్లలో అన్ని వౌళిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణ శివారులోని నందమూరినగర్ సమీపంలో చేపట్టిన 13 వేల గృహ నిర్మాణాలను ఆయన శుక్రవారం పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 5.39 లక్షల ఇళ్లను పేదల కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ షాపూర్జీ పల్లోంజీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్నామన్నారు. వందేళ్లయినా చెక్కుచెదరకుండా ఉండేలా ఆధునిక టెక్నాలజీతో పనులు జరుగుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పేదల పక్కాగృహాల నిర్మాణంలో రాజీ పడే ప్రశక్తేలేదన్నారు. పలు రాష్ట్రాల్లో చేపట్టిన గృహ నిర్మాణాల తీరును, అలాగే విదేశాల్లో గృహ నిర్మాణాల తీరును 8 నెలల పాటు పరిశీలించి ముఖ్యమంత్రికి నివేదిక అందజేశామన్నారు. విదేశాల్లో షేర్వాల్ టెక్నాలజీతో నిర్మిస్తున్న గృహాలపై ప్రణాళిక అందించగా నిర్మాణ సంస్థకు చదరపు అడుగుకు రూ.200 ఎక్కువైనా మంచి సంస్థ ద్వారా కలకాలం గృహాలు నిలిచే విధంగా నిర్మించాలని ఆదేశించారన్నారు.