ఆంధ్రప్రదేశ్‌

హైదరాబాద్‌ను మించి ఐటీ ఉద్యోగాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 24: రాష్ట్రంలో 2019 నాటికీ ఐటీలో లక్ష ఉద్యోగాలు, ఎలక్ట్రానిక్ తయారీ రంగంలో 2 లక్షలు ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పంచాయతీ రాజ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. మంగళగిరి ఐటీ పార్క్ ప్రాంగణంలో శుక్రవారం అక్షరా ఐటీ కంపెనీ, కేజె సిస్టమ్స్ ఐటీ కంపెనీ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ 2014 రాష్ట్ర విభజన జరిగిన నాటికి మనకి రాజధాని లేదని, ఎక్కడనుండి పరిపాలన చేయాలో, ఎక్కడ నుండి ప్రారంభించాలో కూడా తెలియని పరిస్థితిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కార్యదక్షత, అంకితభావంతో 6 నెలల్లోనే తాత్కాలిక సచివాలయాన్ని ప్రారంభించి ఇక్కడ నుంచి పరిపాలన సాగించారన్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు.
విభజన జరిగిన తరువాత కూడా ఐటీ రంగం మొత్తం హైదరాబాద్‌లోనే ఉందన్నా రు. ఆ సమయంలో కేవలం కొన్ని చిన్న ఐటీ కంపెనీలు మాత్రమే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నా ఐటీకి తగిన ప్రోత్సాహం లేదన్నారు. ఐటీకి బ్రాండ్ అంబాసిడర్‌గా దేశంలోనే నిల్చిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. గత మూడు ఏళ్లలో ముఖ్యమంత్రి కష్టం వల్ల అనేక కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయని, తాను మంత్రి అయిన వెంటనే ఐటీ రంగంలో కేవలం పెద్ద కంపెనీలే కాదు మధ్య, చిన్న తరగతి కంపెనీలు కూడా ముఖ్యం అన్న అంశానికి ప్రాధాన్యత ఇచ్చి ఆ దిశలో చర్యలు చేపడుతున్నామన్నారు. భవిష్యత్తులో మంగళగిరి ఐటీ పార్క్‌ను మధ్య, చిన్న తరగతి కంపెనీలకు వేదికగా నిలబెడతామన్నారు. రాబోయే సంవత్సరాలలో మంగళగిరి ఐటీ పార్క్‌లో 10వేల ఉద్యోగాలు రాబోతున్నాయన్నారు. ఐటీ ఉద్యోగాల కోసం రాష్ట్రంలోని యువత ఇతర రాష్ట్రాలకు, ప్రాంతాలకు వెళ్లవల్సిన అవసరం లేదని, ఇక్కడే ఐటీ రంగంలో అవకాశాలు కల్పించబోతున్నామన్నారు. అమరావతిలో ఐటీ రంగం అభివృద్ధికే ముఖ్యమంత్రి 200 ఎకరాలు కేటాయించారని మంత్రి నారా లోకేష్ తెలియజేశారు. ఐటీ రంగాన్ని అభివృద్ధి చెయ్యడానికి, ప్రోత్సహించడానికి దేశంలో ఎక్కడా లేని విధంగా వినూత్న పాలసీలు తీసుకువచ్చి రాయితీలు కల్పిస్తున్నామన్నారు. డిటిపి పాలసీ ద్వారా రియల్ ఎస్టేట్ డెవలపర్స్‌కు 50శాతం రెంటల్ గ్యారంటీ ఇస్తున్నామన్నారు. మరి కొన్ని నెలల్లోనే ఐటీ రంగంలో యువతకు సుమారు 32 వేల ఉద్యోగాలు కలగజేస్తున్నామన్నారు. హైదరాబాద్‌లో 4 లక్షల ఉద్యోగాలు కల్పించడానికి సుమారు 25 సంవత్సరాల కాలం పట్టిందని, కానీ ఆంధ్రప్రదేశ్‌లో అమరావతిలో లక్ష ఉద్యోగాలు కేవలం 2 సంవత్సరాల్లో కల్పించాలి అనే పెద్ద లక్ష్యం పెట్టుకొని అందుకు అనుగుణంగా పని చేస్తున్నామన్నారు.
ప్రపంచంలో ఏ దేశం వెళ్లినా అక్కడ 100 మంది ఐటీ ఉద్యోగులు పని చేస్తుంటే వారిలో 16 మంది ఆంధ్రా ప్రాంతం వారే ఉంటున్నారన్నారు. విభజన సమయానికి ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో మన రాష్ట్రంలో ఒక్క మొబైల్ ఫోన్ కూడా తయారు కాలేదు కానీ ఇప్పుడు దేశంలో తయారవుతున్న ప్రతి పది ఫోన్లలో 2 ఫోన్లు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తయారు అవుతున్నాయన్నారు. 2019 నాటికి ప్రతి ఫోన్లలో 5 ఫోన్లు మన రాష్ట్రంలో తయారు చేసేలా ఎలక్ట్రానిక్ తయారీ రంగాన్ని అభివృద్ధి చేయబోతున్నామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఐటీ రంగం తీవ్ర సంక్షోభంలో ఉందన్నారు. సాధారణ ఐటీ కంపెనీలు కాకుండా ఫిన్‌టెక్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ సేవలు అందిస్తున్న కంపెనీలను రాష్ట్రానికి తీసుకొస్తున్నామన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు, పారిశ్రామిక వేత్తలను మాతృభూమి వైపు చూడాలి అని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ అధికారి విజయానంద్, ఎన్‌ఆర్‌ఐ సలహాదారు వేమూరి రవి, మున్సిపల్ చైర్మన్ గంజి చిరంజీవి, అక్షర ఎంటర్ ప్రైజెస్ ఎం ఎం.సుధీర్, కెజె సిస్టం ఎండి మోహన్, తదితరులు పాల్గొన్నారు.

చిత్రాలు.. మంగళగిరిలో ఐటీ కంపెనీల శంకుస్థాపన కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి నారా లోకేష్
*ఐటీ కంపెనీలకు శంకుస్థాపన చేస్తున్న లోకేష్