ఆంధ్రప్రదేశ్‌

అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 24: ఆంధ్రప్రదేశ్‌లో పేరుకు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పటికీ అవి ఏకపక్షంగా జరుగుతున్నాయన్న విషయం కాదనరానిదని, ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో అధికార తెలుగుదేశం, బీజేపీ, పార్టీ ఫిరాయింపు దార్లు మినహా రాష్ట్ర ప్రజల సమస్యలపై ప్రశ్నించే వారే లేకపోయారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. ప్రస్తుత శాసనసభ ‘బాతాఖానీ క్లబ్’గా మారిందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, పోలవరం నిర్మా ణం, అమరావతి రాజధాని నిర్మాణం విషయమై ఈ నెల 20న చలో అసెంబ్లీ తరువాత సీఎం చంద్రబాబు శాసనసభలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారన్నారు. గత మూడున్నరేళ్ల కాలంలో కేంద్ర సహకారం అంతంత మాత్రంగానే ఉందన్నారు. ఇప్పటికీ విభజన అంశాల్లో కేవలం ఆరు శాతం మాత్రమే అరకొరగా కేంద్రం అమలు చేసిందన్నారు. ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్ర ప్రజలను కేంద్రం మోసం చేసిందని, ఏపీకి ప్రత్యేక హోదాను ప్రజలు డిమాండ్ చేస్తున్న సందర్భంలో అసలు హోదా కల్పించిన రాష్ట్రాలకు కూడా హోదా రద్దవుతుందని చెప్పిన కేంద్రం, ఇప్పుడు ఆయా రాష్ట్రాలకు మరో 10 సంవత్సరాల పాటు రాయితీలు పొడిగించి, విభజన హామీలైన రాయలసీమ, ఉత్తరాంధ్రలకు బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీకి తూట్లు పొడిచి జిల్లాకు రూ.150 కోట్లు మాత్రమే విదిల్చిందన్నారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఊసే లేదని, విశాఖ రైల్వే జోన్ విషయం అతీగతీ లేదన్నారు. రాష్ట్ర రెవెన్యూ లోటు రూ.16 వేల కోట్ల భర్తీ విషయం లో ఇప్పటివరకు కేవలం 4 వేల కోట్లు మాత్రమే ఇచ్చారని అన్నా రు. రాజధాని నిర్మాణానికి రూ.50 కోట్ల ప్రతిపాదనలు పంపితే రూ.2,500 కోట్లు మాత్రమే కేంద్రం ఇచ్చిందన్నారు. 2018 నాటికల్లా పూర్తి చేస్తామన్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు అందక, అంచనాలు పెరిగిపోతున్నాయన్నారు. ఆఖరికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 44 పథకాల విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయమే జరిగిందన్నారు. ఏపీకి ప్రత్యేక తరగతి హోదా, విభజన హామీల అమలు తీరుతెన్నులు, పోలవరం, అమరావతి రాజధాని నిర్మాణం విషయాలపై అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ పై నాలుగు అంశాలపై అఖిలపక్షం ద్వారా కేంద్రంపై ఒత్తిడి తేవడానికి తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలంటూ రామకృష్ణ శుక్రవారం సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు.