ఆంధ్రప్రదేశ్‌

27న అమరావతి డిక్లరేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 24: మహిళలలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు రూపొందించిన ‘అమరావతి డిక్లరేషన్’ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈనెల 27వ తేదీన ఆవిష్కరిస్తున్నారని శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. శుక్రవారం సాయంత్రం స్థానిక ఆర్ అండ్ బి అతిధిగృహంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో స్పీకర్ మాట్లాడుతూ మహి ళా సాధికారత, ఆత్మవిశ్వాసంపై ఈ ఏడాది ఫిబ్రవరి 10,11,12 తేదీల్లో విజయవాడ పవిత్ర సంగమం వద్ద జరిగిన ‘మహిళా పార్లమెంటేరియన్’ సదస్సులో తీసుకున్న నిర్ణయాలను ప్రపంచవ్యాప్తంగా మహిళలకు తెలియజేసే ఉద్దేశ్యంతో పుస్తకాన్ని రూపొందించామన్నారు.
వివిధ దేశాలకు చెందిన మహిళా సభాపతులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థినులు, పారిశ్రామికవేత్తలు మొత్తంగా 25వేల మంది హాజరైన పార్లమెంటేరియన్ సదస్సులో మహిళా సాధికారతపై పలు సూచనలు, సలహాలు, ప్రతిపాదనలన్నింటినీ క్రోడీకరించామని వివరించారు. విజయవాడ సిద్ధార్థ గార్డెన్స్‌లో ఈనెల 27వ తేదీ సాయంత్రం 4 గంటలకు సీఎం పుస్తకావిష్కరణ చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు బాలకార్మికుల హక్కుల ఉద్యమనేత కైలాష్ సత్యార్ధి, భారతీయ స్టేట్ బ్యాంక్ మాజీ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య, అడయార్ క్యాన్సర్ సంస్థ ప్రతినిధి డాక్టర్ శాంత, కేంద్ర మంత్రి ఓఎస్ చౌదరి, ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్, చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి, ఫార్మారంగానికి చెందిన మహిళా వ్యాపారవేత్త మహిమ, వివిధ రంగాల మహిళా ప్రముఖులు హాజరవుతారని వివరించారు. సదస్సులో మహిళలు ఆవిష్కరించిన సలహాలు, సూచనలు ఆధారంగా 10 అంశాలు గుర్తించామన్నారు. విద్య, న్యాయహక్కులు, ఆరోగ్యం, పౌష్టికాహారం, ఔత్సాహిక పారిశ్రామికవేత్త, పరిశోధన, రాజకీయం, సాంఘిక రక్షణ, అభివృద్ధి లక్ష్యా లు, సామాజిక అభివృద్ధి, డిజిటల్ అక్షరాస్యత వంటి అంశాలపై మహిళా డిక్లరేషన్ రూపొందించామని తెలిపారు.