ఆంధ్రప్రదేశ్‌

రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనను అడ్డుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, నవంబర్ 25: ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, గవర్నర్‌కు తక్షణమే ఆదేశాల్వివడంతోపాటు 10వ షెడ్యూల్‌కు సవరణ తీసుకువచ్చి ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై తక్షణమే చర్యలు తీసుకునేలా చూడాలంటూ నెల్లూరు లోక్‌సభ సభ్యుడు, వైకాపా ఫ్లోర్‌లీడర్ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి శనివారం బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుట్ర పన్నుతున్నారని, బహిరంగంగానే ప్రతిపక్షం లేని రాష్ట్రంగా చూస్తామంటూ ప్రకటనలు చేస్తున్నారని పేర్కొన్నారు. 2014లో తమ పార్టీ నుండి గెలిచిన 22 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను ప్రలోభాలకు గురిచేసి టీడీపీలో చేర్చుకున్నారని ఆరోపించారు. ‘ఆపరేషన్ ఆకర్ష’ పేరుతో తమ ఎమ్మెల్యేలను తెలుగుదేశం పార్టీలో చేర్చుకుంటూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. నలుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చారని, మంత్రులు అమర్‌నాథ్‌రెడ్డి, భూమా అఖిలప్రియ, ఆదినారాయణరెడ్డి, సుజయకృష్ణ రంగారావుల పేర్లను ప్రస్తావించారు. ఇప్పటికి ఆ 22 మంది ఎమ్మెల్యేల పేర్లు ఏపి శాసనసభ వెబ్‌సైట్‌లో తమ పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్నారని గుర్తుచేశారు. 10వ షెడ్యూల్‌కు సవరణ తీసుకురావడం ద్వారా అటువంటి పార్టీలు మారే ప్రజాప్రతినిధులకు సంబంధించిన ఫిర్యాదులను 90 రోజుల్లోగా పరిష్కరించి, వారిని అనర్హులుగా ప్రకటించేలా చూడాలని ప్రధానిని కోరారు.