ఆంధ్రప్రదేశ్‌

ఎట్టకేలకు గోదావరి-ఏలేరు అనుసంధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, నవంబర్ 25: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనుసంధాన స్వప్నం మరోసారి సాకారమయ్యింది. గోదావరి నది ఎడమ గట్టుపై తూర్పు గోదావరి జిల్లా పురుషోత్తపట్నం వద్ద నిర్మించిన ఎత్తిపోతల పథకం ద్వారా ఎట్టకేలకు గోదావరి నదీ జలాలు ఏలేరుతో అనుసంధానమయ్యాయి. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా ఈ ప్రక్రియ సాకారమైంది. గోదావరి నది నీటిని ఎత్తి ఏలేరు రిజర్వాయర్‌లో పోసే ప్రక్రియకు జలవనరుల శాఖ అధికారులు నిర్వహిస్తున్న ట్రయిల్ రన్ విజయవంతమయ్యింది. ఈ ఏడాది ఆగస్టు 15న పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జాతికి అంకితం చేశారు. సరిగ్గా వంద రోజుల అనంతరం పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం స్టేజ్-2 నుండి గోదావరి జలాలను ఏలేరు రిజర్వాయర్‌కు పంపించడం పూర్తయ్యింది. ఇప్పటికే స్టేజ్-1 నుండి నీటిని తోడుతున్నప్పటికీ, ఏలేరుకు అనుసంధానం కాకుడానే నేరుగా ఆయకట్టుకు సరఫరా చేస్తున్నారు. తాజాగా స్టేజ్-2లో ఒక పైపు లైన్ నుండి నీటి తోడి ఏలేరు రిజర్వారుకు అనుసంధానం చేశారు. దీనితో గోదావరి జలాలు నేరుగా ఏలేరులో కలవడం ద్వారా అనుసంధాన ప్రక్రియ లాంఛనంగా పూర్తయినట్టయ్యింది. ఈపథకం ప్రత్యామ్నాయ విధానాల ద్వారా వంద రోజుల అనంతరం పూర్తయ్యే స్థితికి చేరుకుంది. ఇంకా బాలారిష్టాలను అధిగమించి పూర్తిస్థాయి లక్ష్యం మేరకు గోదావరి జలాలను ఏలేరుకు అనుసంధానం చేయాల్సివుంది.పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం స్టేజ్-1 విభాగంలో గోదావరి జలాలను తోడి ఒక పైపులైన్ ద్వారా గండికోట వద్ద నిర్మించిన డిశ్చార్జి పాయింట్‌కు చేర్చి, అక్కడ నుంచి పోలవరం ఎడమ ప్రధాన కాల్వ ద్వారా 57 కిలోమీటర్ల వరకు తీసుకెళ్ళి అక్కడ పంపుహౌస్-2లో తోడి అక్కడ నుంచి పైపులైన్ ద్వారా ఏలేరు రిజర్వాయర్‌లోకి తీసుకెళ్ళే విధంగా ఈ పథకాన్ని రూపొందించారు. స్టేజ్-1లో 10 కిలోమీటర్ల పైపులైన్, స్టేజ్-2లో 13.5 కిలో మీటర్ల పైపులైన్ పనులు పూర్తికావలసివుంది. మొత్తం మీద పైపులైన్ పనులు 60 శాతం పూర్తయ్యాయి. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకంలో స్టేజ్-1 పంపుహౌస్ నుంచి గండికోట వద్ద డిశ్చార్జి పాయింట్‌కు జలాలను చేర్చడానికి 10కిలోమీటర్ల మేర ఐదు వరసల ప్రెజర్‌మెయిన్ నిర్మాణం జరుగుతోంది. ప్రస్తుతం రెండు పంపులు, రెండు మోటార్లు అమర్చిన పంపుహౌస్ నుంచి నీటిని తోడి ఒక ప్రెజర్‌మెయిన్ ద్వారా 750 క్యూసెక్కుల నీటిని తోడుతున్నారు. రెండో వరస ప్రెజర్‌మెయిన్ నిర్మాణం పూర్తయింది. ఇంకా మూడు ప్రెజర్‌మెయిన్ల పనులు చివరి ఘట్టానికి వచ్చాయి. స్టేజ్-1లో పది పంపులు, పది మోటార్లు, స్టేజ్-2 పంపుహౌస్‌లో నాలుగు పంపులు, నాలుగు మోటార్లు అమర్చాల్సివుంది. ఇప్పటికి స్టేజ్-1 పంపుహౌస్‌లో రెండు పంపులు, రెండు మోటార్లు బిగించారు. మరో మూడు మోటార్లు బిహెచ్‌ఇఎల్ నుంచి వచ్చాయి. పంపులు అమర్చడం పూర్తయింది. మోటార్లు బిగించాలి. స్టేజ్-2 పంపుహౌస్‌లో మూడు పంపులను అమర్చుతున్నారు. ఇప్పటికి ఒకటి పూర్తయింది. ఒక పంపు, ఒక మోటారు బిగించారు. ఒక ప్రెజర్‌మెయిన్ ద్వారా ట్రయిల్న్ వేశారు. వాస్తవానికి బిహెచ్‌ఇఎల్ నుంచి పంపులు రావడం చాలా ఆలస్యమైంది. దీంతో లక్ష్యం మేరకు పంపులు, మోటార్లు సిద్ధంకావడంలో జాప్యం జరిగింది. స్టేజ్-2లో మూడు పంపులు, మూడు మోటార్లు అమర్చే పనులు జరుగుతున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి అమర్చుతున్నారు. ఒక లైన్ ట్రయిల్ రన్ విజయవంతం కావడంతో రెండో లైన్ సిద్ధం చేసే పనులు జరుగుతున్నాయి. మొత్తం మీద పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నుంచి గోదావరి జలాలు ఏలేరు రిజర్వాయర్‌కు చేరే ప్రక్రియ పూర్తయింది. పథకం పూర్తి స్థాయిలో సిద్ధమయ్యేందుకు మరో నెల రోజులు పట్టవచ్చని అంచనా వేస్తున్నారు.
చిత్రం...ట్రయల్ రన్‌లో ఏలేరు రిజర్వాయర్‌లో కలుస్తున్న గోదావరి జలాలు