ఆంధ్రప్రదేశ్‌

జగన్ యాత్రలోని అద్దె అర్జీల్లో వాస్తవాలెన్ని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), నవంబర్ 25: ప్రతిపక్ష నేత జగన్ చేస్తున్న పాదయాత్రకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన లేదని, పాదయాత్రలో వస్తున్న అద్దె అర్జీల్లో వాస్తవాలెంత అని బనగానపల్లె నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే బిసి జనార్దన్‌రెడ్డి అన్నారు. వైకాపా కార్యకర్తల చేత దొంగ అర్జీలు ఇప్పిస్తున్నారని, పాదయాత్రకు ముందు ప్రశాంత్ కిషోర్ బృందం ఒక కిలోమీటరు ముందుకు వెళ్లి కొందరు అద్దె మనుషులతో అవాస్తవాలను పిటిషన్ల రూపంలో జగన్‌కు అందచేయించి ప్రసంగాలు ఇప్పిస్తున్నారని ఆరోపించారు. పెన్షన్లు వస్తున్న వారిచేత పెన్షన్లు రానట్లుగా అర్జీలు ఇప్పిస్తున్నారని, ఇతరత్రా సదుపాయాలు అర్హత లేని వారి చేత కూడా పిటిషన్లు ఇప్పించి సొంత టీవీలో కల్పిత కథనాలు ప్రసారం చేస్తున్నారని విమర్శించారు. కోవెలకుంట్ల మండలం రెవనూరు గ్రామానికి చెందిన ఆరేళ్ల సందీప్ అనే పిల్లవానికి మూగ, చెవుడు ఉన్నందున చికిత్స చేయించాలని కోరినట్టుగా చెప్పారని, అయితే వాస్తవానికి వస్తే గుంటూరులోని ఆర్‌ఆర్ ఆస్పత్రికి సందీప్ చికిత్స నిమిత్తం 2015 మేలో ముఖ్యమంత్రి సహాయనిధి కింద 5.60లక్షలు విడుదల చేశారన్నారు. అదేవిధంగా కలుగొట్ల గ్రామంలోని ఏ నాగలక్ష్మీమ్మ అనే మహిళ భర్త ఆత్మహత్య చేసుకున్నా డబ్బులు రాలేదని ఫిర్యాదు చేసిందన్నారు. వాస్తవానికి వివాహేతర సంబంధం నేపధ్యంలో ఆత్మహత్య చేసుకున్నారన్నారు. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమేనన్నారు. ఇలాంటి అద్దె ఆరోపణలు నిత్యకృత్యమయ్యాయని అన్నారు. ఇడి రికార్డుల ప్రకారం దేశంలో అవినీతిపరుల జాబితాలో టాప్‌టెన్‌లో ఉన్న జగన్ శశికళ లాగా జైలుకు వెళ్లక తప్పదన్నారు.