ఆంధ్రప్రదేశ్‌

పోలీస్ స్టేషన్ ఆవరణలో అగ్రి బాధితుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమునిపట్నం, నవంబర్ 25: అగ్రిగోల్డ్ పరిహారం కోసం పేరు నమోదు చేసుకోవడానికి వచ్చిన ఒక వృద్ధుడు క్యూలో నిలబడలేక పోలీస్ స్టేషన్ ఆవరణలో మృతి చెందిన వైనమది. భీమి లి సిఐ బాలసూర్యారావు అందించిన వివరాల ప్రకారం విశాఖ జిల్లా భీమిలి మండలం చిప్పా డ దరి పాతపాలేనికి చెందిన జీరు పోలయ్య (50) అనే వృద్ధుడు తన కుమార్తె చిట్టితల్లి పేరున 2003లో అగ్రిగోల్డ్‌లో రూ.5 వేలు డిపాజిట్ చేశాడు. అయితే అగ్రిగోల్డ్ బోర్డు తిప్పేయడంతో రాష్ట్ర ప్రభుత్వం బాధితుల పేర్లను నమోదు చేసే కార్యక్రమం ఆయా పోలీస్ స్టేషన్ల ద్వారా చేపట్టింది. విషయం తెలుసుకున్న పోలయ్య తన కుమా ర్తె పేరు నమోదు చేయడానికి శనివా రం భీమిలి పోలీస్ స్టేషన్‌కు వచ్చా డు. అయితే ఎండవేడమి తాళలేక క్యూ లో ఎక్కువసేపు నిలబడలేక పోలయ్య ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కానిస్టేబుళ్లు స్పందించి ఆసుపత్రికి తీసుకెళ్లే లోపు పోలయ్య మృతి చెందాడు. స్టేషన్ ఆవరణలో క్యూల్లో నిలబడ్డ అగ్రీ బాధితులు ఈ హఠాత్పరిణామానికి దిగ్భ్రాంతి చెందారు. విషయం తెలుసుకున్న బంధువులు భీమిలి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని పోలయ్య మృతదేహాన్ని చూసి విలపించారు. నష్టపరిహారం వస్తుందని ఎదురు చూసిన వ్యక్తి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని బంధువులు విలపిస్తున్నారు.

చిత్రం..మృతి చెందిన పోలయ్య