ఆంధ్రప్రదేశ్‌

చాంతాడును మించుతున్న హామీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, నవంబర్ 25: వైకాపా అధినేత జగన్ ఇస్తున్న హామీ లు చాంతాడును మించుతున్నాయి. ఆయన హామీల జాబితా రోజురోజుకూ పెరుగుతూపోతోంది. ఇడుపులపాయలో ప్రారంభించిన ప్రజా సంకల్పయాత్ర 200 కిలోమీటర్లు ముగించుకుని కర్నూలు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా తనతో ఎవరు కలిసినా వారి సమస్య విని తాను ముఖ్యమంత్రి అయిన వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నారు. ఎవరూ అడగకుండా ఇచ్చిన పింఛను మొత్తం రెట్టింపు హామీ మొదలుకుని మద్యం కారణంగా తమ కుటుంబాలు వీధిన పడుతున్నాయని బెల్టుషాపులు రద్దు చేయించాలని కోరిన మహిళలకు ఏకంగా రాష్ట్రంలో మద్యనిషేధం అమలు చేస్తానని ప్రకటించేశారు. అక్కడి నుంచి ప్రారంభమైన హామీల పరంపర ఉచిత విద్యుత్, మసీదుల్లో పనిచేసే ఇమాంలకు నెలకు రూ. 10 వేల గౌరవ భృతి, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేస్తాననే వరకూ చేరింది. వృద్ధ, వితంతు, దివ్యాంగుల పింఛను మొత్తాన్ని ప్రస్తుతం ప్రభుత్వం చెల్లిస్తున్న దాని కంటే రెట్టింపు చేస్తానని మొదట హామీ ఇచ్చారు. వృద్ధులు, వితంతువులకు ప్రభుత్వం ప్రస్తుతం రూ. వెయ్యి, దివ్యాంగులకు రూ. 1500 పింఛను ఇస్తోంది. ఈ మొత్తాన్ని రూ. 2 వేలు, రూ. 3 వేలుగా చేస్తానని ప్రకటించిన ఆయన ఒకవేళ చంద్రబాబు తాను హామీ ఇచ్చినట్లు పింఛను మొత్తాన్ని ఇవ్వడానికి సిద్ధపడి ఆదేశాలు జారీ చేస్తే దానికి మరో రూ. వెయ్యి పెంచుతానని హామీ ఇచ్చారు. రైతులకు ప్రభుత్వం ఇచ్చిన రుణహామీ ఘోరంగా విఫలమైనందున తాను అధికారంలోకి వచ్చిన తరువాత బేషరతుగా రైతు రుణాలను ఒకేసారి మాఫీ చేస్తానని స్పష్టం చేశారు. అలాగే పొదుపు మహిళలు తీసుకున్న రుణాలను ఏకమొత్తంగా తమ ప్రభుత్వమే చెల్లిస్తుందని వారికి భరోసా ఇచ్చారు. విద్యార్థులు ఎంతవరకూ చదివితే అంతవరకూ ఉచిత విద్య అందజేస్తానని, ప్రస్తుతం ఇంజినీరింగ్ విద్యార్థులకు చెల్లిస్తున్న ఫీజు రీయింబర్స్‌మెంట్ 100 శాతం ప్రభుత్వం భరిస్తుందని, విద్యార్థులను బడికి పంపితే వారి తల్లిదండ్రులకు ఏడాదికి రూ. 15వేలు చెల్లిస్తానని, హాస్టళ్లలో ఉండే విద్యార్థుల భోజన, వసతుల కోసం ఖర్చు చేసే మొత్తాన్ని రూ. 20 వేలకు పెంచుతానని ప్రజలకు వివరిస్తున్నారు. ఇక ప్రస్తుత ప్రభు త్వం విద్యుత్ చార్జీలను తగ్గించే యోచనలో ఉన్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన రోజే ప్రతిపక్ష నేత జగన్ తాను అధికారంలోకి వస్తే 200 యూనిట్ల వరకూ విద్యుత్ ఉచితంగా ఇస్తానని, అం తకు మించిన వినియోగంపై ప్రస్తుతం ఉన్న చార్జీలను గణనీయంగా తగ్గిస్తానని హామీ ఇచ్చారు. తాజాగా పత్తికొండ నియోజకవర్గంలో జగన్‌ను కలిసిన కాంట్రాక్టు ఉద్యోగులతో మాట్లాడిన ఆయన రాష్ట్రంలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తానని భరోసా ఇచ్చి పంపారు. జగన్ పాదయాత్రలో ఇస్తున్న హామీల గురించి తెలుసుకున్న ప్రజలు తమ సమస్యలు వివరించడానికి భారీగా వెళ్తున్నారు. ఎన్నికల సమయంలో తమ పార్టీ ప్రణాళికలో కేవలం కొన్ని పేజీలు మాత్రమే ఉంటాయని జగన్ అంటున్నారు. కాగా ఆయన ఇస్తున్న హామీలు కేవలం అధికారం కోసమేనంటూ టీడీపీ చేస్తున్న విమర్శలను సైతం ప్రజలు గమనిస్తున్నారు.