ఆంధ్రప్రదేశ్‌

సాగర్ మూడో జోన్‌కు నీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 25: కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఆదేశాల మేరకు నాగార్జున సాగర్ ఎడమ కాలువకు ప్రస్తుతం సరఫరా జరుగుతున్న సాగర్ జలాలను డిసెంబర్ ఐదో తేదీ వరకు విడుదల చేసేలా నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలోని ఎన్‌ఎస్‌సి టేకులపల్లి సర్కిల్ కార్యాలయంలో శనివారం సాయంత్రం జరిగిన కీలక సమావేశంలో ఈ మేర కృష్ణా, ఖమ్మం జిల్లా అధికారుల మధ్య ఓ అవగాహన కుదిరింది. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కృషితో మూడో జోన్ పరిధిలోని కృష్ణాజిల్లా ఆయకట్టుకు బోర్డు నాలుగు టీఎంసీలు కేటాయించింది. అయితే ఇందులో ఇప్పటికీ 2.66 టీఎంసీలు మాత్రమే ఆంధ్రాలోకి ప్రవేశించాయి. మూడోజోన్‌లోని పలు మేజర్లలో సాగునీటి సరఫరా పూర్తిగా జరుగలేదు. ఈ కారణంగా ఆంధ్ర సరిహద్దులో 102వ కి.మీ వద్ద ప్రస్తుతం ఇస్తున్న 1600 క్యూసెక్కుల నీటిని డిసెంబర్ ఐదో తేదీ వరకు కొనసాగించాలని మంత్రి దేవినేని ఆదేశంతో నేడు జరిగిన సమావేశంలో ఆంధ్రప్రాంత సాగు నీటి సంఘాల ప్రతినిధులు, అధికారులు గట్టిగా పట్టుబట్టారు. దీనిపై తెలంగాణ ఎస్‌ఇ సి.సాయిబాబు స్పందిస్తూ డిసెంబర్ ఐదో తేదీ వరకు సాగునీటి సరఫరా కొనసాగిస్తామని హామీ నిచ్చారు. అయితే పైనుంచి వచ్చే నీటిని తెలంగాణ, ఆంధ్ర అధికారులు, సాగునీటి సంఘాల అధ్యక్షులు కలిసి సమన్వయంతో ఆంధ్ర ఆయకట్టు చివరి వరకు తీసుకెళ్లాలని కోరారు. ఈ సమావేశంలో జలవనరుల శాఖ ఎపెక్స్ కమిటీ సభ్యులు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు, ప్రాజెక్టు కమిటీ చైర్మన్ వై.పుల్లయ్య చౌదరి, డి సి చైర్మన్ నాదెళ్ల చెన్నకేశవరావు, నూజివీడు ఇఇ ఎస్.అర్జునరావు, మానిటరింగ్ అధికారులు పాల్గొన్నారు.