ఆంధ్రప్రదేశ్‌

దళిత గిరిజనులను ఓటుబ్యాంకుగా మార్చారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 27: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వైఎస్ రాజశేఖరరెడ్డి దళిత గిరిజనులను ఓటుబ్యాంకుగా వాడుకుని, సంక్షేమానికి దూరం చేశారని గిరిజన, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు ధ్వజమెత్తారు. సోమవారం సాంఘిక సంక్షేమంపై శాసనసభలో చర్చ సందర్భంగా మంత్రి నక్కా మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం సబ్‌ప్లాన్ నిధులు గత మూడున్నరేళ్లలో 60 శాతం మేర ఖర్చు చేశామని, మొత్తం 19,178 కోట్ల 72 లక్షలకు గాను 17,370 కోట్లు ఖర్చు అయ్యాయని తెలిపారు. గత ఏడాది 9,847 కోట్లకు 5 వేల కోట్లు, ఈ ఏడాది ఇప్పటివరకు 3,529 కోట్లకు 2,580 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు. నోడల్ ఏజన్సీ సమీక్షా సమావేశం ద్వారా నిధుల వినియోగాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ విద్యోన్నతి కింద 19.7 కోట్లతో 1100 మందికి గత ఏడాది లబ్ధి చేకూరిందని, ఈ ఏడాది ఇప్పటివరకు 18 కోట్లతో 700 మందికి ప్రోత్సాహకాలు అందజేశామన్నారు. గిరిజన సంక్షేమ శాఖ 7 కోట్లతో ప్రయోజనం కల్పించామన్నారు.