ఆంధ్రప్రదేశ్‌

అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 27: పత్తి అమ్ముడుపోలేదని ఏ రైతు బాధపడే పరిస్థితి ఉండకూడదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. నీరు-ప్రగతి, వ్యవసాయం పురోగతిపై వారం వారం నిర్వహించే టెలీకాన్ఫరెన్స్‌లో సోమవారం ఆయన మాట్లాడుతూ మంచి పత్తిలో గుడ్డి పత్తి కలిపి అమ్మే దళారులపై కఠినచర్యలు తీసుకోవాలన్నారు. పత్తి కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడితే కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పత్తి కొనుగోళ్లపై అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. ‘అవకాశం ఉంటేనే అక్రమాలకు పాల్పడతారు. అవకాశమే లేకుండా చూస్తే అక్రమాలకు తావు ఉండదు. రైతులను మోసగించే దళారులపై కఠినంగా వ్యవహరిస్తామని’ ముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ‘ఇప్పటివరకు 1,120 మంది రైతుల వద్ద 24వేల క్వింటాళ్ల పత్తి కొన్నారు, రూ.10 కోట్లు విడుదల చేశాం, రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.8కోట్లు పడిందని’ ఈ సందర్భంగా అధికారులు వివరించారు. వచ్చే రబీ సీజన్‌లో పంటల ఉత్పాదకత పెరిగేలా శ్రద్ధ వహించాలని ముఖ్యమంత్రి కోరారు. అగ్రి హ్యాకథాన్‌లో నేర్చుకున్న మేలైన పద్ధతులు అమలు చేయాలన్నారు. నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో పంట రుణాల పంపిణీ వేగవంతం చేయాలని ఆదేశించారు. వ్యవసాయం ద్వారా 20శాతం మాత్రమే రాబడి వస్తోందని, మిగిలిన 80 శాతం అనుబంధ రంగాల ద్వారానే వస్తోంది కాబట్టి ఆయా రంగాల్లో మరింత పురోగతిని సాధించాలన్నారు. బహిరంగ మార్కెట్‌లో టమోటా ధరలు భారీగా పెరిగిన నేపధ్యంలో రైతుబజార్లలో సరసమైన ధరలకు విక్రయించేలా చూడాలని ఆదేశించారు. సకాలంలో మార్కెట్ జోక్యం చేసుకుని అటు రైతలకు, ఇటు వినియోగదారుల ప్రయోజనాలను కాపాడాలని దిశా నిర్దేశం చేశారు. నరేగా నిధుల వినియోగంలో పూర్తి పారదర్శకత పాటించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అన్ని రికార్డులు పకడ్బందీగా నిర్వహించాలన్నారు. అందరికీ పని కల్పిస్తే సుస్థిర ఆర్థికాభివృద్ధి సాధించడం సులభమే అనేది గుర్తుంచుకోవాలన్నారు.
వ్యవసాయ వ్యర్థాలను తగులబెట్టే పద్ధతి మానుకోవాలి
‘వ్యవసాయ వ్యర్థాలను తగులబెట్టే అలవాటు మాన్పించాలి. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు రాజధాని ప్రాంతంలో ఇది జరగకుండా చూడాలి. వ్యవసాయ వ్యర్థాలను కంపోస్ట్‌గా మార్చి సేంద్రియ ఎరువుగా వినియోగించాలి. రాజస్థాన్‌లో వ్యర్థాలను తగులబెట్టడం వల్ల ఢిల్లీ వరకు కాలుష్యం విస్తరించింది. కాలుష్య రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రూపొందాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. దోమల ఉత్పత్తి కేంద్రాలను నియంత్రించాలని, వివిధ పంటలపై తెగుళ్ల బెడద నిరోధించాలని సూచించారు. కాలుష్య రహిత ఇంధన ఉత్పత్తిలో భాగంగానే సౌర విద్యుత్, పవన విద్యుత్ ఉత్పాదనను భారీ ఎత్తున ప్రోత్సహిస్తున్న విషయం గుర్తుచేశారు. యూనిట్ విద్యుత్ ధర రూ.5 నుంచి 5.50 చొప్పున కొనుగోళ్లకు, ఉత్పత్తికి ఖర్చవుతున్న నేపధ్యంలో సౌర విద్యుత్ యూనిట్ రూ.2.50కే అందుబాటులోకి రావడం వల్ల భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు తగ్గే అవకాశం ఉందన్నారు. ఆసియాలోనే అతి పెద్ద కంట్రోల్ రూమ్ అమరావతిలో ఏర్పాటు చేశామన్నారు. ప్రతిరోజూ గంట కంట్రోల్ రూమ్‌లోనే గడుపుతానని ప్రకటించారు. శాఖల మధ్య సమన్వయం, మెరుగైన పనితీరు ద్వారానే వినూత్న ఫలితాలు సాధించగలమని అన్నారు. రాష్ట్రం ఒక యూనిట్‌గా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, జిల్లా ఒక యూనిట్‌గా అన్ని శాఖలు జిల్లా స్థాయిలో పరస్పరం సహకరించుకోవాలని ముఖ్యమంత్రి మార్గదర్శనం చేశారు.
జనవరి కల్లా రెండున్నర లక్షల ఇళ్ల నిర్మాణం
జనవరికల్లా రెండున్నర లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలి. రోజుకు కనీసం 1000 ఇళ్ల నిర్మాణం పూర్తికావాలి అని ముఖ్యమంత్రి ఆదేశించారు. 2017-18లో 50శాతం ఇళ్లు మాత్రమే మంజూరు చేశారని, మిగిలిన ఇళ్లు కూడా త్వరగా మంజూరు చేయాలన్నారు. 2016-17లో గ్రౌండ్ అయిన 90 శాతం ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేలా శ్రద్ధ వహించాలన్నారు. టెలీ కాన్ఫరెన్స్‌లో వ్యవసాయం, జలవనరులు, గ్రామీణ, పట్టణాభివృద్ధి, హౌసింగ్, రియల్ టైం గవర్నెన్స్ అధికారులు రాజశేఖర్, వెంకటేశ్వరరావు, రామాంజనేయులు, జవహర్‌రెడ్డి, కాంతిలాల్ దండే, సీఎంవో కార్యదర్శి రాజవౌళి తదితరులు పాల్గొన్నారు.