ఆంధ్రప్రదేశ్‌

యువతను జాగృతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 27: దేశ సంపద యువతను జాగృతం చేయడం ద్వారా జాతికి ఖ్యాతిని తీసుకురావాలన్నదే తన కర్తవ్యమని ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ అన్నారు. ఇషా ఫౌండేషన్, యునిసెఫ్, ఎపీ ప్రభుత్వం ఉమ్మడి ఆధ్వర్యంలో సోమవారం విశాఖలో నిర్వహించిన గ్రామోత్సవ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జాతికి అవసరమైన యువతను కర్తవ్యం వైపు నడిపించాల్సి ఉందన్నారు. సమాజంలో ప్రాచీన క్రీడలు, కళలు ఎన్నో ఉన్నాయని, వీటికి ప్రాచుర్యం కల్పించాల్సి ఉందన్నారు. మానవ జీవితంలో క్రీడలతో ముడిపడి ఉందని, మనిషి దైనందిన జీవితంలో క్రీడలు భాగం కావాలన్నారు. దేశం సుఖ సంతోషాలతో కళకళలాడాలంటే గ్రామాలు, గ్రామాల్లోని ప్రతి ఇంట సంతోషం వెల్లివిరియాలన్నారు. క్రీడలతోనే మానసికోల్లాసం పొందగలన్నది తన ప్రగాఢ విశ్వాసమన్నారు. అందుకోసమే గ్రామీణోత్సవ్ పేరిట గత 22 ఏళ్లుగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. అర్జున అవార్డు గ్రహీతలు, ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన థన్‌రాజ్ పిళ్లై, కరణం మల్లీశ్వరి గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన వారేనన్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావుమాట్లాడుతూ యువతలో నాయకత్వ లక్షణాలు పెంపొందాలని, దీనికోసం ఫౌండేషన్ స్థాపించి తమిళనాట అద్భుత ఫలితాలు సాధిస్తున్న సద్గురు గొప్ప మార్గదర్శకులన్నారు. ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశాఖ కేంద్రంగా లీడర్‌షిప్ అకాడెమీ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో ఇషా ఫౌండేషన్ భాగస్వామ్యం కావాలన్నారు.