ఆంధ్రప్రదేశ్‌

స్వరం పెంచిన విపక్ష నేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, నవంబర్ 27: కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రలో వైకాపా అధినేత జగన్ స్వరం పెంచారు. గత 18 రోజులుగా ప్రభుత్వంపై విమర్శలు, తాను అధికారంలోకి వస్తే అమలుచేసే హామీలు, తండ్రి దివంగత రాజశేఖర్‌రెడ్డిపై పొగడ్తలతో ప్రసంగాలు కొనసాగించిన ఆయన 19వ రోజు కర్నూలు జిల్లా కోడుమూరు బహిరంగసభలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై వ్యక్తిగత విమర్శలకు దిగారు. కోడుమూరులో సోమవారం జరిగిన బహిరంగ సభ సందర్భంగా చంద్రబాబు ఒక దళారీ అని, దళారుల పాలనలో రైతులకు న్యాయం ఎలా జరుగుతుందని ఆయన తీవ్రస్వరంతో ప్రశ్నించారు. చంద్రబాబు కుటుంబం నిర్వహిస్తున్న హెరిటేజ్ కంపెనీ వ్యాపారాలపై ఆయన నిప్పులు చెరిగారు. పాలు, కూరగాయలు రైతుల వద్ద తక్కువ ధరకు కొని వినియోగదారుల నుంచి ర్పొరేట్ వ్యాపారం పేరుతో ఎక్కువ ధర వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రైతుల వద్ద పంట ఉత్పత్తులు కొని ఇతరులకు లాభాలకు అమ్మేవారిని దళారీ అంటారని, అదేపని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు మంత్రి లోకేష్ చేస్తున్నారని గుర్తుచేశారు. కిలో ఉల్లిగడ్డలు రూ.14, రూ.15కు కొని వాటినే హెరిటేజ్ దుకాణంలో కిలో రూ.50కు అమ్ముతుండగా శెనగలు కిలో రూ.40, రూ.50కు కొని రూ.120కి అమ్ముతున్నారని జగన్ అన్నారు. అంటే రైతులకు అందుతున్న ధర వినియోగదారులకు చెల్లిస్తున్న ధర మద్యలో వ్యత్యాసాన్ని చంద్రబాబు జేబులో వేసుకుంటున్నారని మండిపడ్డారు. రైతులకు రుణమాఫీ అని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఒక్క రూపాయి అయినా మాఫీ చేశారా అంటూ ప్రశ్నించారు. రైతు కంట కన్నీరు చూసిన వారు ఎవరూ బాగుపడిన చరిత్ర లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత 18 రోజులుగా సాదాసీదాగా సాగిన జగన్ ప్రసంగాలు, 19వ రోజు తీవ్రస్థాయికి చేరుకోవడంతో ప్రజా సంకల్పయాత్ర చర్చనీయాంశంగా మారింది. కోడుమూరు సభ వరకు సుమారు 14 చోట్ల బహిరంగ సభల్లో జగన్ ప్రసంగించినా ఎక్కడా ఈ స్థాయిలో చంద్రబాబు, ఆయన వ్యాపారాలపై తీవ్ర వ్యాఖ్యలు చేయలేదు. యాత్రను వేడెక్కించడానికే తీవ్రవ్యాఖ్యలు చేసి ఉంటారని విశే్లషకులు భావిస్తున్నారు. సంకల్పయాత్ర కేవలం ప్రసంగాలు, హామీలు, ప్రభుత్వంపై విమర్శలతో సాదాసీదాగా సాగుతుండడంతో ప్రజలు పెద్దగా దృష్టిసారించడం లేదని జగన్ భావించి ఉండవచ్చని విశే్లషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపధ్యంలోతన ప్రసంగాల్లో వాడి, పాదయాత్రలో వేడి రగిల్చకపోతే ప్రజల్లో తన యాత్ర తేలిపోతుందని జగన్ అనుమానించి తీవ్రవ్యాఖ్యలకు తెరతీసి ఉంటారని అంచనా వేస్తున్నారు. జగన్ చేసిన ఆరోపణలపై ఇప్పటికే రాష్టవ్య్రాప్తంగా తెలుగుదేశం శ్రేణులు ప్రతిదాడికి దిగడంతో ఆయన అనుకున్నట్లుగానే ప్రజా సంకల్పయాత్ర ప్రజల్లో చర్చనీయాంశం అవుతోందని విశే్లషకులు అంటున్నారు. రానున్న రోజుల్లో జగన్ తన తండ్రిపై పొగడ్తలు తగ్గించి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే సందర్భోచితంగా చంద్రబాబుతోపాటు ఆ పార్టీలోని ఇతర నాయకులపై కూడా వ్యక్తిగత విమర్శలకు దిగే అవకాశం ఉందని విశే్లషకులు అంచనా వేస్తున్నారు.