ఆంధ్రప్రదేశ్‌

జీరో అవర్‌పై మంత్రుల నిర్లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 27: శాసనసభ సమావేశాల్లో ఎంతో కీలకమైన జీరో అవర్‌లో సభ్యుల ప్రశ్నలను మంత్రులు ఎంతో తేలిగ్గా తీసుకుంటున్నారు.. ప్రతి ప్రశ్నకు రొటీన్‌గా ఒకే సమాధానం.. నోట్ చేసుకున్నాం.. సంబంధిత మంత్రికి తెలియజేస్తాం అని చెప్పటం మినహా నెలలు గడుస్తున్నా సమాధానాలు రావటం లేదు.. ఇక చర్యలు ఏమీ ఉండటం లేదంటూ ప్రస్తుత సమావేశాల్లో రెండోసారి సోమవారం పలువురు తీవ్ర అసంతృప్తితో పెదవి విరిచారు.
మంత్రి ఆదేశించినా దిక్కులేదా: తెనాలి శ్రావణ్‌కుమార్
తుళ్లూరు, తాడికొండ మండలాల్లో ఉల్లి పంటను కాపాడేందుకు 45 రోజులపాటు 9గంటలపాటు విద్యుత్‌ను సరఫరా చేయమని విద్యుత్ శాఖ మంత్రి కళా వెంకట్రావు స్వయంగా ఆదేశించారు. ఆపై తాను స్వయంగా ఏఇ నుంచి ఆ శాఖ ఉన్నతాధికారులందరిని కలిసి కోరినా ఫలితం లేదంటూ తెనాలి శ్రావణ్‌కుమార్ ఆవేశంతో అన్నారు. కనీసం ఈ ప్రశ్నకు వారం పదిరోజుల్లోనే స్పందించాలన్నారు.
సీఎం హామీ అమల్లో జాప్యం: ధర్మవరం ఎమ్మెల్యే సూర్యనారాయణ
ధర్మవరంలో బిసి గురుకుల పాఠశాల ఏర్పాటుపై సీఎం చంద్రబాబు స్వయంగా హామీనిచ్చినా నేటికీ అమలుకాలేదు. దీనివల్ల విద్యార్థులు అనంతపురంకు వెళ్లి చదువుకోవాల్సి వస్తున్నదని శాసనసభ్యులు సూర్యనారాయణ అన్నారు.
దీర్ఘకాలిక లీజులు రద్దుచేయాలి: మీసాల గీత
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ భూములను 50, 80 ఏళ్లకు లీజుకు ఇచ్చారు. అయితే అభివృద్ధి లేదు అందుకే ఆ లీజులు రద్దుచేసి ఆర్‌టిసి లాభాల బాటలో నడిపించాలని విజయనగరం ఎమ్మెల్యే మీసాల గీత కోరారు.
జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం అవసరం: ఎస్వీ మోహన్‌రెడ్డి
రాష్ట్ర వ్యాప్తంగా 4లక్షల మంది ఇంటర్ చదువుతున్నారు. భోజనాల కోసం ఇళ్లకు వెళ్లినవారు తిరిగి రావటం లేదు. అందుకే మధ్యాహ్న భోజన పథకం అమలుచేస్తే హాజరు శాతం పెరుగటంతో పాటు ఉత్తమ ఫలితాలు వస్తాయని ఎస్వీ మోహన్‌రెడ్డి కోరారు.
ప్రధాన రహదారులకు మరమ్మతులు అవసరం: బోడే ప్రసాద్
విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారి నిర్మాణంలో కంకిపాడు, ఉయ్యూరులలో బైపాస్ రోడ్ నిర్మాణం జరుగుతున్నదని పాత ఆర్ అండ్ బి రహదారులన్నీ భారీ వాహనాల తాకిడితో ధ్వంసమైనందున తక్షణం మరమ్మతులు చేయాలని పెనమలూరు శాసనసభ్యులు బోడె ప్రసాద్ కోరారు.