ఆంధ్రప్రదేశ్‌

‘ఫాతిమా’ విద్యార్థులను ఆదుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 27: కడపలో ఫాతిమా వైద్య కళాశాల విద్యార్థుల మనోవేదనపై మానవతా దృక్పధంతో స్పందించి కేంద్రమే నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించాలని విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి ఏకగ్రీవంగా తీర్మానించింది. తీర్మానాన్ని సోమవారం ముఖ్యమంత్రి సభలో ప్రవేశపెట్టగా ఉభయసభలు ఆమోదించాయి. ఈ సమస్య సుమారు 100 మంది పేద, మధ్య తరగతి విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిందని, విద్యార్థులకు న్యాయం జరిగేలా సమస్యను పరిష్కరించడానికి రాష్ట్రప్రభుత్వం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ), కేంద్రప్రభుత్వంతో అనేక పర్యాయాలు సంప్రతింపులు జరిపిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇటీవల రాష్ట్రప్రభుత్వం కూడా కేంద్రాన్ని సంప్రతించగా మిగిలిన కళాశాలల్లో సర్దుబాటు చేస్తామని హామీ ఇచ్చిందని, హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు కూడా అమలు చేయడం వలన ఇబ్బందులు తలెత్తాయని వివరించారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సమస్యను పరిష్కరించాల్సి ఉండగా కోర్టు ఆదేశాల కారణంగా విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా మారుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ పరిస్థితుల్లో శాసనసభలో తీర్మానం చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు కేంద్రానికి మరోసారి ప్రతిపాదన పంపుతున్నామని తెలిపారు. విద్యార్థులు ఆత్మస్థైర్యంతో నీట్ ప్రవేశ పరీక్షకు హాజరు కావాలని, అందుకు అయ్యే ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. విద్యార్థుల తల్లితండ్రులపై ఫాతిమా కళాశాల యాజమాన్యం దౌర్జన్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇదే పద్ధతి కొనసాగితే అరెస్ట్ చేసి లోపలేయిస్తామని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. అభద్రతా భావంతో ఉన్న విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు రాష్ట్రప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు.