ఆంధ్రప్రదేశ్‌

బాలల సమస్యల పరిష్కారానికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 27: రాష్ట్రంలో బాలల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు స్పష్టం చేశారు. సోమవారం ఏపీ అసెంబ్లీలోని కాన్ఫరెన్స్ హాలులో 13 జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులతో ఆయన మాట్లాడారు. ప్రస్తుత సమాజంలో బాలబాలికలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలంటూ స్పీకర్ కోడెలకు 13 జిల్లాల నుంచి వచ్చిన 64 మంది విద్యార్థులు వినతిపత్రం అందజేశారు. పాఠశాలల్లో కనీస వౌలిక సదపాయాలు, లింగ వివక్ష లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని, మరుగుదొడ్లు నిర్మించాలని, బాల్య వివాహాలు అరికట్టాలని ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ కోడెల శివప్రసాదరావు మాట్లాడుతూ ప్రపంచంలో బాలబాలికల సమస్యల పరిష్కారానికి ఐక్యరాజ్యసమితి తీర్మానం చేసిందన్నారు. ఇందుకోసం 17 లక్ష్యాలను నిర్దేశించిందన్నారు. ఇందులో భారతదేశం కూడా భాగస్వామ్యమైందన్నారు. ఇటీవల బంగ్లాదేశ్‌లో నిర్వహించిన ప్రపంచస్థాయి సదస్సులో బాలల సమస్యలపై పెద్దఎత్తున చర్చ జరిగిందని స్పీకర్ తెలిపారు. యునిసెఫ్, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కూడా బాలల సమస్యలపై కలిసి పనిచేస్తున్నాయన్నారు. సుస్థిర అభివృద్ధికి లక్ష్యాల పేరుతో 13 జిల్లాలకు చెందిన 64 మంది విద్యార్థులు వివరించిన సమస్యలను ప్రభుత్వ సమస్యలుగా భావించి, వాటి పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. బాలల కోర్కెలు నెరవేర్చడం దేశం బాధ్యత అన్నారు. అనంతరం నిలకడైన అభివృద్ధి లక్ష్యాల సాధనకు పిల్లల అభిప్రాయాలపై నివేదిక అనే పుస్తకాన్ని స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యునిసెఫ్ ఏపీ కమ్యూనికేషన్ స్పెషలిస్ట్ ప్రసూన్ సేన్, మహితా స్వచ్ఛంద సంస్థ డైరక్టర్ రమేష్‌శేఖర్‌రెడ్డి, ఆ సంస్థ ప్రతినిధులు సునీల్‌కుమార్, రోషన్‌కుమార్, జయరాజ్, మోహనరావు, పాల్గొన్నారు.