ఆంధ్రప్రదేశ్‌

మాతా, శిశు సంక్షేమానికి పెద్దపీట: మంత్రి సునీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 27: ప్రభుత్వం మాతా, శిశు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత తెలిపారు. మహిళా సంక్షేమంపై సోమవారం శాసనసభలో చర్చ సందర్భంగా ఆమె మాట్లాడారు. బాలామృతం పథకానికి నెలకు 20 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని, మధ్యాహ్న భోజన పథకాన్ని 12.50 కోట్లతో కొనసాగిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో మాతా, శిశు మరణాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని చెప్పారు. గర్భిణులకు పౌష్ఠికాహారంతో పాటు తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్ ద్వారా వైద్యసేవలు అందిస్తున్నామని, పౌష్ఠికాహారం పంపిణీలో ఎలాంటి అవకతవకలకు తావులేదన్నారు. ఏజన్సీ ప్రాంతాల్లో గిరి గోరుముద్దలు పథకాన్ని అమలు చేస్తున్నామని, అన్న అమృతహస్తం ద్వారా గర్భిణులకు 5,66,000 మందికి పౌష్ఠికాహారం పంపిణీ చేశామన్నారు. 3 చొప్పున అంగన్‌వాడీ కేంద్రాలను ఒక ప్రీ స్కూల్‌గా ఏర్పాటుచేసి బాలబాలికలకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నట్లు వివరించారు. డ్వాక్రా మహిళలకు పెట్టుబడి నిధిగా 10 వేల రూపాయల ఆర్థికసాయాన్ని ప్రభుత్వం మంజూరు చేస్తోందని, ప్రణాళికాబద్ధంగా మహిళా సాధికారతకు చర్యలు చేపట్టామన్నారు.