ఆంధ్రప్రదేశ్‌

ఏనుగులున్నాయ్ బయట తిరగొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుప్పం, నవంబర్ 28: చిత్తూరు జిల్లా కుప్పం, గుడుపల్లి మండలంలోని అటవీ సరిహద్దు ప్రాంతాల్లో నివాసమున్న ప్రజలు సాయంత్రం 6 నుండి ఉదయం 7గంటల వరకు ఇళ్లల్లో నుండి బయటకు రావద్దని సిఎం పిఏ మనోహర్ సూచించారు. మంగళవారం స్థానిక మండల కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కర్నాటక రాష్ట్రం నుండి వచ్చిన ఐదు ఏనుగుల గుంపు గత మూడు రోజులుగా మండల పరిధిలోని అటవీ సమీప గ్రామాల్లో సంచరిస్తూ పంట పొలాలను నాశనం చేస్తున్నాయని, వాటిని నిలువరించేందుకు ఎప్పటికప్పుడు స్థానిక అటవీ అధికారులు అన్ని చర్యలూ చేపడుతున్నారని తెలిపారు. మరోవైపు కర్నాటక అటవీ అధికారులు ఏనుగులను తమ పంట పొలాలవైపు రాకుండా నిలువరిస్తున్నారని, ఇలాంటి సమయంలో మనుషులెవరైనా తారసపడితే ఏనుగులు చంపేస్తాయన్నారు. పంట పోయినా ఫర్వాలేదు, కనీసం ప్రాణాలైనా కాపాడుకోవాలని ఆయన పేర్కొన్నారు. అనంతరం కుప్పం అటవీశాఖాధికారి కాలప్పనాయుడు మాట్లాడుతూ ఏనుగుల సంచారాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయా గ్రామాల్లో సాయంత్రం 6నుండి ఉదయం 7గంటలవరకూ ప్రజలెవరూ బయటకు రాకూడదంటూ దండోరా వేసి తగు జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామ కార్యదర్శులను ఆదేశించారు. సాయంత్రం పొద్దుపోయాక, ఉదయం 7గంటలైనా మంచుకురుస్తున్న కారణంగా ఏనుగుల సంచారం గుర్తించడం కష్టమతుందని చెప్పారు. ప్రజలెవరూ తెలుపురంగు దుస్తులు ధరించవద్దని, పంటపొలాల్లో సరిహద్దులను గుర్తించేందుకు తెలుపురంగు పౌడరును వాడవద్దని తెలిపారు.