ఆంధ్రప్రదేశ్‌

మన మెట్రో పట్టాలెక్కేది ఎప్పుడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 28: పబ్లిక్, ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ విధానంలో చేపట్టిన హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ ప్రపంచంలోనే అది పెద్ద మెట్రోగా గణతికెక్కింది. పదేళ్ల నుంచి ఎదురు చూస్తున్న మెట్రో రైలు నేడు ప్రజల ముందుకు వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉంటే, ఈ ప్రాజెక్ట్‌ను చూసి ఆంధ్ర ప్రాంత ప్రజలు తెలంగాణ ప్రజల ఆనందంలో పాలుపంచుకునేవారు. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో రెండు మెట్రో ప్రాజెక్ట్‌లకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రాష్ట్ర రాజధాని అమరావతిలో ఒకటి, ఆర్థిక రాజధాని విశాఖలో మరొకటి. ఈ ప్రతిపాదనలు జరిగి మూడేళ్లయినా, ఈ రెండు ప్రాంతాల్లో మెట్రో ప్రాజెక్ట్‌లు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. అమరావతి మెట్రో ప్రాజెక్ట్ చేపట్టడానికి ఆసక్తి ఉన్న వారు ముందు రావాలని అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ ఆహ్వానించగా, 11 అంతర్జాతీయ కంపెనీలు ఆసక్తి కనబరిచాయి. జర్మన్ డవలప్‌మెంట్ బ్యాంక్ అమరావతి మెట్రోకు ఆర్థిక సహకారం అందించేందుకు కూడా ముందుకు వచ్చింది. ఈనెల 30 నాటికి సుమారు ఎనిమిది అంతర్జాతీయ కంపెనీలు ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌లు సిద్ధం చేసే అవకాశం ఉందని మెట్రో అధికారులు భావిస్తున్నారు. డిసెంబర్‌లో వీటిని పరిశీలించి, కేంద్రానికి పంపించనున్నారు. అయితే, విజయవాడ మెట్రోను పిపిపి విధానంలో చేపట్టాలా? లేదా పూర్తిగా ప్రభుత్వ నిధులతో చేపట్టాలా అన్న అంశం వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో కానీ స్పష్టత వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. కాగా, అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్, ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్‌కు గత నెలలో జరిగిన ఎంఓయు రద్దయిన విషయం తెలిసిందే. విజయవాడలో లైట్ మెట్రో రైల్ నడపాలని కేంద్రం సూచించింది. అయితే, ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ మీడియం మెట్రో రైల్ నడపాలని భావిస్తోంది. అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ విజయవాడ మెట్రోకు సంబంధించి చేసిన ప్రతిపాదనలను కేంద్రం తిరస్కరించింది. ఈ ప్రాజెక్ట్‌కు ఫైనాన్సియల్ వైబులిటీ లేదని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో విజయవాడకు లైట్ లేదా మీడియం మెట్రో రైల్ మాత్రమే వచ్చే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్‌కు పరిస్థితులు కొంత అనుకూలంగా ఉన్నాయి. విశాఖలో గాజువాక నుంచి కొమ్మాది మధ్య 42.54 కిలో మీటర్ల మెట్రో లైన్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఉంది. విశాఖ మెట్రోను పీపీపీ విధానంలోనే చేపట్టడానికే ప్రభుత్వం నిర్ణయించింది. సుమారు 9000 కోట్ల రూపాయలు ఖర్చయ్యే విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్‌కు కొరియన్ ఎగ్జిమ్ బ్యాంక్ విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్‌కు 4,500 కోట్ల రూపాయలు నిధులు ఇవ్వడానికి ముందుకు వచ్చింది. ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టడానికి విశాఖ మెట్రో రైల్ కార్పొరేషన్ ఆసక్తి ఉన్న వారి కోసం ప్రకటన చేయగా, 11 ప్రముఖ కంపెనీలు ఆసక్తి కనబరిచాయి. ఇందులో ఏడు అంతర్జాతీయ కంపెనీలు కూడా ఉన్నాయి. కాగా, తొలి దశలో గాజువాక, నుంచి కొమ్మాది వరకూ ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టాలని భావిస్తున్నారు. కొమ్మాది నుంచి సుమారు 40 కిలో మీటర్ల దూరంలో ఉన్న భోగాపురం వద్ద ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు రానున్న దృష్ట్యా అక్కడికి ఈ ప్రాజెక్ట్‌ను కొనసాగించాలని భావిస్తున్నారు. భోగాపురంలో ఎయిర్‌పోర్టు రావడానికి చాలా కాలం పట్టే అవకాశం ఉన్నందువలన, మెట్రోను పొడిగించాలని భావిస్తున్నారు. కాగా, విశాఖ మెట్రో ప్రాజెక్ట్ కోసం భూసేకరణ ఎటువంటి సమస్య ఉండదని, ప్రాజెక్ట్ చేపట్టడానికి ఏ కంపెనీ అయినా, ముందుకు వస్తే, యుద్ధ ప్రాతిపదికన భూ సేకరణ జరుపుతామని అధికారులు తెలియచేస్తున్నారు.