ఆంధ్రప్రదేశ్‌

దళిత ఉద్యోగులను వేధిస్తున్న ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 28: దళిత, బీసీ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం కావాలని వేధిస్తోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పార్టీ గుంటూరు జిల్లా పరిశీలకులు బొత్స సత్యనారాయణ ఆరోపించారు. రోజురోజుకూ దళిత ఉద్యోగులపై దాడులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పొన్నూరు పీహెచ్‌సీలో ఉద్యోగిగా పనిచేస్తున్న రవికుమార్ ఆత్మహత్యే ఇందుకు నిదర్శనమని అన్నారు. మంగళవారం గుంటూరులోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబుతో కలిసి ఆయన మాట్లాడారు. దళిత, బీసీ ఉద్యోగులపై దాడులకు నిరసనగా తమ పార్టీ కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. దాడులకు నిరసనగా ఒకరోజు వౌన ప్రదర్శనలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో మంత్రులు, శాసనసభ్యుల ఆగడాలు పెరిగిపోయాయని, ప్రభుత్వం వాటిని నివారించలేక పోతోందన్నారు. అన్ని వర్గాల ప్రజలు తెలుగుదేశం ప్రభుత్వ చర్యలతో బాధలు పడుతున్నారని, వారందరికీ తాము అండగా ఉంటామన్నారు. ఎవరినైనా ఇబ్బందులు పెడుతుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. సాగునీరు విడుదల, రైతుల నుంచి భూముల సేకరణ వంటి విషయాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాజధాని నిర్మాణానికి వైసీపీ వ్యతిరేకం కాదని, రైతుల నుంచి తీసుకున్న భూములు సక్రమంగా వినియోగించక పోవడానే్న తాము నిరసిస్తున్నామన్నారు.