ఆంధ్రప్రదేశ్‌

ఆర్థిక సంక్షోభంలో భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని, నవంబర్ 28: నరేంద్రమోదీ పాలనలో దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోందని లోక్‌సత్తా జాతీయ నేత జయప్రకాష్ నారాయణ అన్నారు. ప్రతి సంవత్సరం వంట నూనెలు, కందిపప్పు దిగుమతి చేసుకోవడం వల్ల రూ.1.40 లక్షల కోట్లు రైతులకు నష్టం చేకూరుతోందన్నారు. కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో మంగళవారం రాత్రి ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ప్రపంచంలోనే వంటనూనెలు, కందిపప్పు దిగుమతిదారుగా భారతదేశం ప్రథమ స్థానంలో ఉండడం సిగ్గుచేటన్నారు. ప్రధాని మోదీ పాలనవల్ల ఎగుమతి, దిగుమతుల వల్ల 20 వేల బిలియన్ డాలర్ల నష్టం జరిగిందన్నారు. వేరుశెనగ, సన్‌ప్లవర్, సోయాబీన్, కంది పండించే రైతులకు సబ్సిడీ ఇవ్వడం లేదా ఇతరత్రా ఆర్థిక సహాయం అందిస్తే వంటనూనెలు, కందిప్పు దిగుమతి చేసుకునే అవసరం రాదన్నారు. పైగా మనకే ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు వీలవుతుందన్నారు. నేడు వ్యవసాయం తీవ్రసంక్షోభంలో ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పెంచడం, రైతులకు ఆదాయం చేకూర్చే అంశాలపై చర్చ జరగడం లేదన్నారు. వ్యవసాయ రంగం పూర్తిగా నాశనం అవుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పెరిగినప్పడు ధరలు తగ్గించడం ఎలా అనే విధానాన్ని ప్రభుత్వాలు ఆలోచిస్తోందే తప్ప ధరలు తగ్గినప్పుడు ఎలా పెంచాలని ఆలోచించడం లేదని, అందువల్లే రైతులు ప్రభుత్వ విధానాలతో నాశనం అవుతున్నారన్నారు. వరి, చేపలు, పత్తి మొదలగు వాటిని విదేశాలకు ఎగుమతి చేయడం లేదన్నారు.