ఆంధ్రప్రదేశ్‌

తూర్పు మన్యంలో యాపిల్ సాగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, నవంబర్ 28: తూర్పు మన్యం సరికొత్త పంటల సాగుకు ప్రయోగ క్షేత్రంగా మారింది. తాజాగా ఇక్కడ యాపిల్ సాగు చేపట్టారు. ఇప్పటి వరకు అరకు ప్రాంతానికే పరిమితమైన యాపిల్ సాగు ఇపుడు తూర్పు కనుమల్లో కూడా చేపట్టారు. మారేడుమిల్లి ప్రాంతంలో ఆదివాసీ రైతులతో ప్రయోగాత్మకంగా యాపిల్ సాగు చేపట్టారు. విదేశీ అవసరాలకు అనుగుణంగా కొన్ని బహుళజాతి సంస్థలకు ప్రయోగశాలగా దశాబ్దాలుగా తూర్పు మన్యం దోహద పడుతోంది. నిమ్మ గడ్డి, అనాస, కమలా పంటల సాగు అనంతరం రబ్బరు సాగుచేపట్టారు. తాజాగా ఆ జాబితాలో యాపిల్ సాగు కూడా చేరింది. మారేడుమిల్లి మండలం కుందాడ, కుట్రవాడ గ్రామాలకు చెందిన 10 మంది ఆదివాసీ రైతులను ఒక యూనిట్‌గా ఎంపికచేసిన ప్రాంతాల్లో రూ.ఐదు లక్షల విలువైన ప్రాజెక్టుకు రూపకల్పనచేసి యాపిల్ సాగు చేపట్టారు. ఐటిడిఎ, ట్రైకార్, ఉద్యాన శాఖ సంయుక్తంగా ఈ ప్రయోగాన్ని చేపట్టాయి. ఈ అధ్యయన ఫలితాలను బట్టి లోతట్టు, కొండకోనల్లో శీతల వాతావరణం అధికంగావున్న ప్రాంతాల్లో యాపిల్ సాగుకు సిద్ధంచేశారు. ప్రస్తుతం కుందాడ, కుట్రవాడ గ్రామాల్లో యాపిల్ సాగు చేపట్టారు. ఒక్కో రైతుకు 100 మొక్కల చొప్పున 10 మంది రైతులకు 1000 మొక్కలు ఇచ్చి ప్రయోగాత్మకంగా సాగు చేపట్టారు. అన్నాగోల్డెన్ డిసార్ట్, స్కార్టర్, గాలా, సుజి అనే నాలుగు రకాల యాపిల్ అంట్లను కాశ్మీర్, సిమ్లా నుంచి రప్పించారు. అంటుకట్టే విధానంలో వీటిని పెంచుతున్నారు. మొక్కలు నాటిన మూడేళ్లకుగానీ పంట చేతికిరాదు.
ఈ ప్రాంతంలో నాటిన యాపిల్ మొక్కలు అపుడే అయిదు అడుగుల ఎత్తువరకు పెరిగాయి. మన్యంలో వాతావరణ పరిస్థితులపై అధ్యయనం చేసిన తర్వాత యాపిల్ సాగు చేపట్టామని రంపచోడవరం ఐటిడిఎ ఉద్యాన శాఖ అధికారులు తెలియజేశారు. విశాఖ జిల్లా చింతపల్లి, అరకులో కూడా ఇదేతరహా ప్రాజెక్టును చేపట్టడంతో అక్కడి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ తోటల పెంపకం చేపట్టారు. డ్రిప్, స్ప్రింకర్లతో నీటిని పొదుపుగా వినియోగించి యాపిల్ పంట చేతికందేలోపు, అంతర పంటగా కూరగాయల సాగుతో ఆదాయం పొందే విధంగా ఉద్యాన శాఖ ఏర్పాట్లుచేసింది.

చిత్రం..ఏజెన్సీ ప్రాంతంలో నాటిన యాపిల్ మొక్కలు పరిశీలిస్తున్న ఉద్యానవన శాఖ అధికారులు