ఆంధ్రప్రదేశ్‌

ఓవర్ హెడ్ ట్యాంకులపై ‘యాప్’లతో నిఘా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 28: గ్రామీణులకు సురక్షిత తాగునీరు అందించడం ద్వారా మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధుల వ్యాప్తిని అరికట్టేందుకు మంత్రి నారా లోకేష్ ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశారు. టెక్నాలజీని ఉపయోగించి గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని మంత్రి లోకేష్ లక్ష్యంగా పెట్టుకున్నారు. వచ్చే సంవత్సరంలో అంటువ్యాధుల వ్యాప్తిని వీలైనంత తగ్గించాలని, మలేరియా, డెంగ్యూ కేసులు రాష్ట్రంలో నమోదు అవ్వడానికి వీలులేదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో మంత్రి లోకేష్ ఈ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. సురక్షిత తాగునీరు అందించడానికి యుద్ధప్రాతిపదికన క్లోరినేషన్, ఓవర్ హెడ్ ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. పంచాయతీరాజ్ శాఖ అధికారులతో వాట్సప్, కైజాలలో ప్రత్యేక యాక్షన్ గ్రూపులు ఏర్పాటుచేసి ప్రతి రోజూ గ్రామాల్లో జరుగుతున్న క్లోరినేషన్ ప్రక్రియను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. గ్రామా ల్లో ఉన్న 17వేలకు పైగా ఓవర్‌హెడ్ ట్యాంకుల్లో క్రమం తప్పకుండా క్లోరినేషన్ చెయ్యడంతోపాటు ప్రతిరోజూ ఎన్ని ట్యాంకుల్లో క్లోరినేషన్ జరుగుతుంది అనే విషయాన్ని స్వయంగా తెలుసుకుంటున్నారు. క్లోరినేషన్, ఓవర్‌హెడ్ ట్యాంకులు శుభ్రపరిచేప్పుడు అధికారులు ఫొటోలు తీసి పూర్తి సమాచారంతో వాట్సప్, కైజాల గ్రూపుల్లో అప్‌లోడ్ చెయ్యాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతి నెలా 2సార్లు ఓవర్‌హెడ్ ట్యాంకుల్లో క్లోరినేషన్ అండ్ క్లీనింగ్ తప్పనిసరిగా చెయ్యాలని మంత్రి అధికారులకు సూచించారు. అంతేకాకుండా ప్రజలకు సరఫరా అవుతున్న నీటి నాణ్యత తెలుసుకోవడానికి ప్రభుత్వ యంత్రాంగంతోపాటు థర్డ్‌పార్టీ చెక్ కూడా ఉంటుందని మంత్రి హెచ్చరిస్తున్నారు. ప్రజలకు అందిస్తున్న తాగునీటిలో నాణ్యతా ప్రమాణాలు లేకపోతే అధికారులపై చర్యలు తీసుకుంటామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. మంత్రి స్వయంగా ప్రారంభించిన వాట్సప్, కైజాల గ్రూపులు సత్ఫలితాలు ఇస్తన్నాయి. గ్రామాల్లో క్లోరినేషన్ ప్రక్రియను వాట్సప్, కైజాలలో అప్‌లోడ్ చేస్తున్నారు. ప్రజలకు మెరుగైన ఆరోగ్యాన్ని అందించడానికి సహకరిస్తున్న సిబ్బందిని అభినందించారు. త్వరలోనే క్లోరినేషన్ పద్ధతిలో వచ్చిన నూతన ఆవిష్కరణ ఆటో లిక్విడ్ క్లోరినేషన్‌ను వినియోగించాలి. ఆటో లిక్విడ్ క్లోరినేషన్‌ను పైలెట్ ప్రాజెక్టుగా మంచి ఫలితాలు వస్తే రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామాల్లో ఈ పద్ధతి ద్వారా ఓవర్‌హెడ్ ట్యాంకుల క్లోరినేషన్ చేసేందుకు కార్యాచరణ సిద్ధం చెయ్యాలని మంత్రి నారా లోకేష్ మంగళవారం జరిగిన సమీక్షలో అధికారులకు సూచించారు.