ఆంధ్రప్రదేశ్‌

గిరిజనంపై ప్రత్యేక దృష్టి పెట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 28: రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు విద్య, వైద్యం వంటి ముఖ్య రంగాల్లో మెరుగైన ఫలితాలను సాధించేందుకు యూనిసెఫ్ అవసరమైన ప్రత్యేక ప్రణాళికలతో తగిన సాంకేతిక సహకారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ కోరారు. మంగళవారం అమరావతి సచివాలయంలోని తన కార్యాలయంలో రాష్ట్రంలో యూనిసెఫ్ సహకారంతో రానున్న ఐదేళ్ల కాలంలో అమలు చేయనున్న వివిధ పథకాలకు సంబంధించి వార్షిక సంయుక్త సమావేశం సీఎస్ అధ్యక్షతన జరిగింది. రానున్న ఐదేళ్లలో రాష్ట్రంలో పాఠశాల విద్య, ఆరోగ్యం, జువనైల్ జస్టిస్, కార్మిక, ప్రణాళిక, పోలీస్ (హోం), గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, గ్రామీణ తాగునీరు, పారిశుద్ధ్యం, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం అంశాల్లో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు, నాలుగు దశాబ్దాల నుండి అనేక కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తున్నప్పటికీ అనుకున్న లక్ష్యాలను పూర్తిగా సాధించలేక పోతున్నామన్నారు. పూర్తి లక్ష్యాల సాధనకు తీసుకోవాల్సిన చర్యలపై తగిన తోడ్పాటును అందించేందుకు యూనిసెఫ్ కృషి చేయాలని కోరారు. అన్ని రంగాలు, అన్ని ప్రాంతాలపై ఒకేసారి దృష్టి సారించకుండా కొన్ని ప్రత్యేక పథకాలు, ప్రాంతాలపై దృష్టి సారించి నిర్దేశిత లక్ష్యాలను సాధించాక మిగతా ప్రాంతాలు, రంగాలపై దృష్టి పెట్టి లక్ష్య సాధనకు కృషిచేస్తే బాగుంటుందని సూచించారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ముఖ్య రంగాల్లో నిర్దేశిత లక్ష్యాలను సాధించేందుకు తగిన సాంకేతిక తోడ్పాటును అందించాలని కోరారు. ముఖ్యంగా గిరిజనుల జీవన ప్రమాణాల్లో సమూలమైన మార్పులు తెచ్చేందుకు సహకరించాలని కోరారు. మాతా, శిశు మరణాలు పూర్తిగా తగ్గించేందుకు, గర్భిణులు, బాలింతల్లో రక్తహీనత సమస్యను అధిగమించేందుకు, మహిళలు, బాలికల్లో పౌష్టికాహార లోప నివారణకు అమలుచేస్తున్న పథకాలు, కార్యక్రమాలు మరింత సమర్ధంగా అమలు చేసేందుకు సాంకేతిక సహకారం అవసరమని చెప్పారు. వ్యక్తిగత మరుగుదొడ్లను ప్రజలు పూర్తిగా వినియోగించుకునేలా అవగాహన కలిగించేందుకు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ విద్యాలయాల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపర్చేందుకు, తద్వారా మెరుగైన ఫలితాల సాధనకు తీసుకోవాల్సిన చర్యలపై తగిన తోడ్పాటు అందించాలని దినేష్‌కుమార్ కోరారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల యూనిసెఫ్ ఫీల్డ్ ఆఫీస్ చీఫ్ మైటల్ రుషీడియా మాట్లాడుతూ రాష్ట్రంలో రానున్న ఐదేళ్ల కాలంలో వివిధ రంగాల్లో ప్రభుత్వ శాఖల సమన్వయంతో కలిసి పనిచేసేందుకు తగిన కార్యాచరణను అమలు చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో వివిధ రంగాల్లో యూనిసెఫ్ సేవలు అందిస్తోందని గుర్తుచేశారు. బహిరంగ మలవిసర్జన రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు. వివిధ రంగాల్లో నిర్దేశిత లక్ష్యాల సాధనకు ప్రభుత్వ శాఖల సమన్వయంతో తగిన సాంకేతిక సహకారం అందించేందుకు అన్నివిధాలా కృషి చేస్తామని ఆమె వివరించారు. స్ర్తి శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి కే సునీత, హోంశాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్ అనురాధ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్, యూనిసెఫ్ విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు.