ఆంధ్రప్రదేశ్‌

వీలైనన్ని విమానాలకు కనెక్టివిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 28: రాష్ట్రంలో వీలైనన్ని విమాన సర్వీసులను నడపడం ద్వారా ఎయిర్ కనెక్టివిటీ పెంచడానికి ప్రయత్నించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో విమానాశ్రయాల అభివృద్ధి, కొత్త విమానాశ్రయాల ఏర్పాటు, విమానయాన సర్వీసుల పెంపుపై నిర్దిష్ట కాలవ్యవధిలో పనులు పూర్తిచేసేలా కార్య ప్రణాళికను సిద్ధం చేయాలని చెప్పారు. మంగళవారం రాత్రి ముఖ్యమంత్రి తన కార్యాలయంలో ఏడు సెక్టార్లకు సంబంధించి వౌలిక వసతులు, ప్రాజెక్టుల పురోగతిని అధికారులతో సమీక్షించారు. రాష్ట్రం నుంచి అన్ని విమానాలు 90 నుంచి 95 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయని అధికారులు చెప్పడంతో, పెరుగుతున్న అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరిన్ని సర్వీసులను పెంచవలసిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అన్నారు. ‘మన రాజధాని నుంచి దేశంలోని ఇతర నగరాలకు కనెక్టివిటీ పెంచాలి. దీనిపై పట్టుదలతో కృషి జరిపి కేంద్ర అధికారులపై ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉందని’ ముఖ్యమంత్రి చెప్పారు. మరిన్ని విమాన సర్వీసులను నడపడం ద్వారా రీజనల్ కనెక్టివిటీ పెంచడానికి కృషి చేస్తున్నట్టు అధికారులు ఆయనకు చెప్పారు. ఇందులో భాగంగా విజయవాడ-కడప-విజయవాడ మార్గంలో రోజుకు రెండు పర్యాయాలు, విజయవాడ-పుట్టపర్తి మార్గంలో రోజకు ఒక పర్యాయం చొప్పున విమాన సర్వీసులు నడపడానికి ప్రయత్నాలు చేస్తున్నామని వౌలిక వసతుల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్ ముఖ్యమంత్రికి వివరించారు. ప్రస్తుతానికి 8 నుంచి 20 సీటర్ల చిన్న ఎయిర్‌క్రాప్ట్ నడుపుతారు. సంబంధిత అనుమతులు రాగానే జనవరి ఒకటో తేదీ నుంచి ఈ సర్వీసులను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. హైదరాబాద్-విజయవాడ-హైదరాబాద్ మార్గంలో మరిన్ని విమాన సర్వీసులను నడపడానికి ఎయిరిండియా, జెట్ ఎయిర్‌వేస్, ఇండిగో వంటి విమానయాన సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపారు. తిరుపతి విమానాశ్రయం నుంచి త్వరలో అంతర్జాతీయ విమాన సర్వీసులు నడవనున్నాయని, అక్కడ మూడు అదనపు పార్కింగ్ బేస్‌తో విస్తరణ పనులు ఇప్పటికే 88 శాతం పూర్తయ్యాయని చెప్పారు. విజయవాడ విమానాశ్రయానికి ఇప్పటికే అంతర్జాతీయ హోదా దక్కిందని, కోడ్-ఇ తరహా ఎయిర్‌క్రాప్టులు నడిపేందుకు వీలుగా ప్రస్తుత రన్‌వే విస్తరణ పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. ఇప్పటికే మంజూరైన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనాల నిర్మాణాన్ని రెండున్నరేళ్లలో పూర్తిచేయనున్నట్టు చెప్పారు. రాజమహేంద్రవరం విమానాశ్రయానికి సంబంధించి 3 అదనపు పార్కింగ్ బేస్‌కు సంబంధించిన యాప్రాన్ నిర్మాణం పూర్తయిందని, రన్‌వే నిర్మాణం శరవేగంగా జరిపి వచ్చే నెలాఖరులోగా పూర్తిచేస్తామని తెలిపారు.
కుప్పం, దొనకొండ, నాగార్జునసాగర్, పుట్టపర్తిలలో ప్రస్తుతం ఉన్న బ్రౌన్‌ఫీల్డు ఎయిర్‌పోర్టుల అభివృద్ధి పనులపై సమావేశంలో ముఖ్యమంత్రికి వివరించారు. దొనకొండ విమానాశ్రయానికి సంబంధించి చిన్నతరహా విమానాల రాకపోకలకు వీలుగా ప్రస్తుతం ఉన్న రన్‌వేను విస్తరించడానికి అనుమతి కోరుతూ ఎయిర్‌పోర్టు అధారిటీ ఆఫ్ ఇండియాకు లేఖ రాశామని చెప్పారు. విజయనగరం జిల్లా భోగాపురం విమానాశ్రయానికి సంబంధించిన అంశాన్ని వచ్చే మంత్రిమండలి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి ఇప్పటికే అన్ని రకాల పర్యావరణ అనుమతులు లభించాయని అధికారులు చెప్పారు. 280.4 ఎకరాల ప్రైవేట్ భూములు సహా మొత్తం 493 ఎకరాల మేర భూములు ఈ విమానాశ్రయం ఏర్పాటుకు ఇంకా అందించాల్సి ఉందని వివరించారు. దగదర్తి విమానాశ్రయం నిర్మాణానికి సంబంధించి మొత్తం 1399 ఎకరాల భూమిలో 1095 ఎకరాల స్థలం స్వాధీనపర్చామని చెప్పారు. ఓర్వకల్లు విమానాశ్రయం ఏర్పాటుకు అవసరమైన అన్ని పర్యావరణ అనుమతులు లభించాయని తెలిపారు. కర్నూలు, కడప జిల్లాల్లో ఏర్పాటుచేస్తున్న ఆల్ట్రా మెగా సోలార్ పార్కులు, అనంతపురంలో ఏపీ జెన్‌కో నెలకొల్పుతున్న సోలార్ పార్కు పురోగతిని అధికారులు సమావేశంలో ముఖ్యమంత్రికి వివరించారు. అనంతపురం ఆల్ట్రా మెగా సోలార్ పార్కుకు తొలి దశలో 250 మెగావాట్ల సామర్ధ్యం, రెండవ దశలో మరో 750 మెగావాట్ల మేర సామర్ధ్యం ఉంటుందని చెప్పారు. వచ్చే ఆర్ధిక సంవత్సరానికి ఇది ప్రారంభం అవుతుందన్నారు. కడపలోని 400 మెగావాట్ల సామర్ధ్యం గల ప్లాంట్ 2018 మార్చి నాటికి ఏర్పాటు చేస్తామని చెప్పారు. కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో ఏపీ జెన్‌కో ఏర్పాటుచేస్తున్న ధర్మల్ ప్లాంట్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. రూ.756 కోట్ల పెట్టుబడితో విశాఖపట్నంలో కనె్వన్షన్ సెంటర్ ఏర్పాటుకు లులూ ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్ సంస్థ ముందుకొచ్చిందని, ఈ కనె్వన్షన్ సెంటర్‌తోపాటు ఎగ్జిబిషన్, ఫైవ్‌స్టార్ హోటల్, కమర్షియల్ కాంప్లెక్స్ ఉంటాయని ముఖ్యమంత్రి చంద్ర బాబు వివరించారు.