ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రంలో పీహెచ్‌సీల ప్రక్షాళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 28: ‘సమాజంలో ప్రతిఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం. అనారోగ్యానికి గురైతే ఎన్ని లక్షలైనా గుమ్మరిస్తాం. పరి సరాల పరిశుభ్రత పాటిస్తేనే ఆరోగ్యం. లేకపోతే అంటువ్యాధులు తప్పవు’ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వైద్య, ఆరోగ్య రంగంపై మంగళవారం శాసనసభలో లఘు చర్చ జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆహార అలవాట్లలో లోపాలు, నీటి కాలుష్యం, మానసిక ఒత్తిడి, వంశపారంపర్య కారణాల వల్ల వ్యాధులు సంక్రమిస్తున్నాయన్నారు. గిరిజన ప్రాంతాల్లో మంచినీటి కాలుష్యం వల్లే సీజనల్, అంటువ్యాధులు ప్రబలుతున్నాయన్నారు.
వచ్చే ఏడాది మార్చి నెలాఖరులోగా బహిరంగ మలమూత్ర విసర్జన రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దటంతో పాటు కాలుష్య నియంత్రణకు పక్కా ప్రణాళిక రూపొందించామని చెప్పారు. రాష్ట్రంలో మలేరియా కేసులు గత ఏడాది 19వేల 614 ఉంటే ఈ ఏడాది 15వేల 540 నమోదయ్యాయన్నారు. దేశం మొత్తంగా 26వేల 376 డెంగ్యూ కేసులకు గాను 199 మంది మృతి చెందారని, రాష్ట్రంలో 3750 మంది రోగులు ఉన్నట్లు తేలిందన్నారు. స్వైన్‌ఫ్లూ ప్రభావం అతి తక్కువగా ఉందన్నారు. ఇప్పటివరకు 470 కేసులు నమోదుకాగా పొరుగున ఉన్న కర్నాటకలో 3వేల 751 మంది ఉన్నారన్నారు. వచ్చే ఏడాది నుంచి మలేరియా, విషజ్వరాల కేసులు గణనీయంగా తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ‘మనిషి ఆనందంగా బతకాలంటే ఆరోగ్యంగా ఉండాలి. ఇందుకు జొన్నరొట్టెల వంటివి శ్రేయస్కరం. ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ రెండు రూపాయలకే కిలో బియ్యం అందించారు. దీంతో పాలిష్ బియ్యం లేకుండా తినే పరిస్థితులు లేవు. డబ్బున్నవాళ్లు బియ్యం తినడం మానేశారు. పేదవాళ్లే తింటున్నారు’ అని ఆయన వ్యాఖ్యానించారు. సామాన్యుడి ఆరోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. ఇందులో భాగంగానే తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్, చంద్రన్న సంచార వైద్యశాలల ద్వారా 12 వందల గ్రామాలకు వైద్యసేవలు విస్తృతం చేశామన్నారు. 105 సర్వీస్ ల్యాబ్‌ల ద్వారా వైద్య పరీక్షలను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నామని తెలిపారు. ప్రతిఒక్కరికీ హెల్త్ ప్రొఫైల్ అందుబాటులో ఉంచుతామన్నారు. అధునాతన యంత్ర పరికరాలు, వైద్య విధానంతో కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వం సేవలందిస్తోందని చెప్పారు. రాష్టవ్య్రాప్తంగా 4424 బయోమెట్రిక్ పరికరాలు అందుబాటులో ఉంచామన్నారు. నూరు శాతం జియో ట్యాగింగ్ చేశామన్నారు. ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా 1040 వ్యాధులకు చికిత్స నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మాతా, శిశు మరణాలను నియంత్రించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని, పౌష్టికాహారం అందించడంలో ఎలాంటి అరమరికలు లేవన్నారు. విశాఖపట్నం కేజీహెచ్, గుంటూరు జీజీహెచ్‌లో ఎలుకలు, పాములు సంచరిస్తున్నాయని, వీటిలో ప్రత్యేక శానిటేషన్ విధానాన్ని అమలులోకి తెస్తామన్నారు. కేజీహెచ్‌లో రోగులకు అందుతున్న సేవలపై అసంతృప్తి వ్యక్తమవుతోందని, వైద్యశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీచేసి నిరంతరం వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఫలితంగా తలసరి వైద్యఖర్చులు 5500 నుంచి 12 వందలకు తగ్గాయని, జీవన సామర్ధ్యం ఐదేళ్లకు పెరిగిందని వివరించారు. ఏపీఎంఐడీసీని కూడా పటిష్టం చేసి రాష్ట్రం మొత్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సీహెచ్‌సీలలో నిరంతర సేవలతో పాటు అన్నిరకాల మందులు అందుబాటులో ఉంచుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు.
చిత్రం..వైద్య, ఆరోగ్య రంగంపై సభలో ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు