ఆంధ్రప్రదేశ్‌

నేడు అసెంబ్లీలో సచివాలయ ఆకృతుల ప్రదర్శన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 29: నార్మన్ ఫోస్టర్ బృందం సమర్పించిన సచివాలయ ఆకృతులను శాసనసభలో గురువారం ప్రదర్శించనున్నారు. వీటిపై ఎమ్మెల్యేల అభిప్రాయాలను తెలుసుకుందాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. నార్మన్ ఫోస్టర్ బృందం అందచేసిన సచివాలయ ఆకృతులపై వెలగపూడి సచివాలయంలో సిఆర్‌డిఎ అధికారులతో బుధవారం సీఎం చాలాసేపు చర్చించారు. ఆ బృందం అందచేసిన మూడు ఆప్షన్లను పరిశీలించారు. పాలవాగుకు ఒకవైపు సీఎం కార్యాలయ భవనం, మరోవైపు నాలుగు టవర్లుగా సచివాలయ ఆకృతిపై సీఎం మొగ్గు చూపారు. ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకుని, తదుపరి నిర్ణయం తీసుకుందామన్నారు. రాజధాని పరిధిలోని వివిధ రహదారుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, 635 కోట్ల రూపాయలతో ఎమ్మెల్యేలకు, ఐఎఎస్ అధికారుల కోసం నిర్మిస్తున్న గృహ సముదాయం పనుల పురోగతిపై కూడా సమీక్షించారు. 2019 ఫిబ్రవరి నాటికి పూర్తి కావాలని ఆదేశించారు. మంత్రి నారాయణ, సీఆర్‌డీఏ అధికారులు పాల్గొన్నారు.