ఆంధ్రప్రదేశ్‌

‘పోలవరం’పై రాళ్లేస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 29: పోలవరం ప్రాజెక్టు పనులు ఆపేందుకు ప్రతిపక్షం రాళ్లు వేసే కార్యక్రమం చేపట్టిందంటూ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఆరోపించారు. రాష్ట్ర శాసన మండలిలో పోలవరం ప్రాజెక్టుపై బుధవారం స్వల్పకాలిక చర్చ జరిగింది. చాలా మంది సభ్యులు మాట్లాడిన తరువాత, దీనిపై మంత్రి మాట్లాడుతూ పార్టీ నిధుల కోసం ప్రాజెక్టు పనులు చేపడుతున్నారంటూ, ప్రాజెక్టు సైట్ చూడకుండానే ప్రతిపక్ష నేత జగన్ రాళ్లు వేస్తున్నారని విమర్శించారు. నిర్వాసితులు దేవుళ్లని, వారికి ఏలూరు లాంటి పట్టణాన్ని నిర్మిస్తామన్నారు. 30 లక్షల క్యూబిక్ మీటర్ల మేర కాంక్రీటు పనులు జరగాల్సి ఉందన్నారు. పనుల్లో జాప్యం జరుగకుండా 150 కోట్లతో ఇంప్రెస్టు నిధులు కేటాయించామని గుర్తు చేశారు. గోదావరి-పెన్నా అనుసంధానం గురించి కేంద్ర మంత్రి గడ్కరీ కూడా మాట్లాడుతున్నారని గుర్తు చేశారు.
పోలవరం పనుల్లో వేగం కోసం కొన్ని పనులకు టెండర్లు పిలుస్తున్నామన్నారు. కాఫర్ డ్యాం 150 అడుగులు ఎత్తులో నిర్మిస్తే, 192 టీఎంసీల నీటిని నిల్వ చేయవచ్చన్నారు. ఈలోగా పునరావాస పనులు పూర్తి చేస్తామన్నారు. కేంద్రం నుంచి 3102 కోట్ల రూపాయలు రావాల్సి ఉందని, 2010-11 నాటి ప్రాజెక్టు అంచానాల్లో 3000 కోట్ల రూపాయలు ఆర్‌ఆర్‌కు కేటాయించారన్నారు. ఇప్పడు 33 వేల రూపాయలు అవుతుందని అంచనా వేశామన్నారు. 58 వేల కోట్ల రూపాయల్లో ఎక్కువ మొత్తం పునరావాసానికే ఖర్చు అవుతుందన్నారు. పోలవరం అంచనాలు ఎందుకు పెంచారని విమర్శలు చేస్తున్నారని, పారదర్శకంగా, నిబంధనల మేరకు టెండర్లు పిలిచామన్నారు.
రాళ్లు వేస్తూ, పనులు ఆపాలని జగన్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. విద్యుత్ ప్రాజెక్టును ఎపిజెన్‌కో చేపడుతుందన్నారు. పెండింగ్‌లో ఉన్న బకాయిలు చెల్లించాలని, సవరించిన అంచనాలను ఆమోదించాలని కేంద్రాన్ని కోరుతున్నానని తెలిపారు.